జాతీయ వార్తలు

మితిమీరిన అభిమానం… ఆసుపత్రిపాలైన డ్యాన్సర్!

  • నర్తకిపై అసభ్యంగా ప్రవర్తించిన ఆకతాయిలు
  • బలవంతంగా నోటిలో నాణెలు పెట్టి మింగించిన వైనం
  • ఊపిరాడక తీవ్ర అస్వస్థతకు గురైన నర్తకి
  • బీహార్ లోని భోజ్‌పూర్ జిల్లాలో ఘటన

బీహార్‌లో జరిగిన ఓ దారుణ ఘటన తీవ్ర ఆగ్రహాన్ని రేపుతోంది. స్థానిక సాంస్కృతిక కార్యక్రమంలో నృత్యం చేస్తున్న మహిళపై కొందరు దుండగులు అమానుషంగా ప్రవర్తించడంతో ఆమె ప్రాణాపాయ స్థితికి చేరుకుని ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
ఈ ఘటన భోజ్‌పూర్ జిల్లాలోని చంద్వా తోలా ప్రాంతంలో జరిగింది. 

వేలాదిమంది హాజరైన కార్యక్రమంలో వేదికపై నృత్య ప్రదర్శన కొనసాగుతుండగా, కొందరు ఆకతాయిలు నర్తకితో అసభ్యంగా ప్రవర్తించారు. మొదట నాణేలు విసిరిన వారు, అనంతరం వేదికపైకి ఎక్కి బలవంతంగా ఆమె నోటిలో నాణేలు పెట్టి మింగించారు. దీంతో ఆమెకు ఊపిరాడక తీవ్ర అస్వస్థతకు గురైంది. దీంతో అక్కడి పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. 

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలిని అత్యవసరంగా అరా సదార్ హాస్పటల్‌కు తరలించారు. వైద్యులు ఆమె గొంతులో ఇరుక్కున్న నాణేలను తొలగించినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని, తదుపరి 24 గంటలు కీలకమని వైద్యులు వెల్లడించారు. 

బాధితురాలి భర్త రాజు కుమార్ మాట్లాడుతూ, తన భార్య వేదికపై నృత్యం చేస్తుండగా కొందరు ప్రేక్షకులు పైకి ఎక్కి బలవంతంగా నోటిలో నాణేలు పెట్టారని ఆరోపించారు. వెంటనే ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కార్యక్రమ నిర్వాహకులు, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు పోలీసులు నమోదు చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

Related posts

ఒకే ఫ్లోర్‌ 25 మందికి అమ్మకం.. గురుగ్రామ్‌లో భారీ రియల్ ఎస్టేట్ స్కాం…

Ram Narayana

తాము ప్రోటోకాల్ అతిక్రమిస్తే ఆర్టికల్ 142 ప్రస్తావనకు వచ్చేది …  సీజేఐ జస్టిస్ గవాయ్‌

Ram Narayana

“న్యాయ క్రియాశీలత… న్యాయ ఉగ్రవాదంగా మారకూడదు”: సీజేఐ జస్టిస్ గవాయ్

Ram Narayana