ఎంటర్టైన్మెంట్ వార్తలు

గన్నవరం విమానాశ్రయంలో జగన్ తో సినీ నటుడు బ్రహ్మానందం…

  • గన్నవరం విమానాశ్రయంలో ఒకరికొకరు తారసపడ్డ జగన్, బ్రహ్మానందం
  • ఇద్దరూ కుశల ప్రశ్నలు వేసుకున్న వైనం
  • గన్నవరం నుంచి బెంగళూరుకు వెళ్లిపోయిన జగన్

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ ను ప్రముఖ సినీ నటుడు బ్రహ్మానందం కలిశారు. విజయవాడ గన్నవరం విమానాశ్రయంలో ఈ అరుదైన కలయిక చోటు చేసుకుంది. బెంగళూరుకు వెళ్లేందుకు జగన్ విమానాశ్రయానికి చేరుకున్నారు. అదే సమయంలో హైదరాబాద్ నుంచి ఒక పని మీద గన్నవరం చేరుకున్న బ్రహ్మానందం ఎయిర్ పోర్టులోనే ఉన్నారు. ఇద్దరూ ఒకరికొకరు తారసపడ్డారు. ఈ సందర్భంగా ఇద్దరూ కుశల ప్రశ్నలు వేసుకున్నారు. బ్రహ్మానందం యోగక్షేమాలు, ఆరోగ్యం గురించి జగన్ అడిగి తెలుసుకున్నారు. వీరి కలయికకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

Related posts

కుల్దీప్ యాదవ్ పెళ్లికి తిలక్ వర్మ.. ముస్సోరీలో క్రికెటర్ల సందడి…

Ram Narayana

వివాదంలో జన నాయగన్ మూవీ.. ఎందుకు రిలీజ్ కాలేదో ప్రజలకు తెలుసన్న విజయ్ తండ్రి!

Ram Narayana

డిప్యూటీ సీఎం భట్టి కుమారుడు కోడలను ఆశ్వీర్వదించిన సీఎం చంద్రబాబు…

Ram Narayana