ఆంధ్రప్రదేశ్

బాణసంచా పేలుడు ఘటన… పరారీలో తయారీ కేంద్రం యజమాని…

  • బాణాసంచా తయారీ పరిశ్రమకు మార్చి 31 వరకు లైసెన్సు ఉందన్న ఆర్డీవో మల్లిబాబు
  • పేలుడు ఘటన అనంతరం తయారీ కేంద్రం యజమాని పరారయ్యాడన్న ఆర్డీవో 
  • పొలాల మధ్యలో 6 షెడ్లు వేసి బాణసంచా తయారు చేస్తున్నట్లు గుర్తించిన అధికారులు

కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో ఘోర ప్రమాదంలో 20 మంది కార్మికులు సజీవ దహనం కాగా, మరో పది మందికిపైగా గాయపడిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనపై ఆర్డీవో మల్లిబాబు స్పందించారు. ఈ బాణాసంచా తయారీ పరిశ్రమకు ఈ ఏడాది మార్చి 31 వరకు లైసెన్సు ఉందని తెలిపారు. పేలుడు ఘటన అనంతరం తయారీ కేంద్రం యజమాని పరారయ్యాడని చెప్పారు. 

గాయపడిన వారిలో ఆరుగురు కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారని ఆర్డీవో తెలిపారు. బాధితుల్లో వేట్లపాలెం వాసి కప్పా వెంకట లక్ష్మి, పెద్దాపురం వాసి మోర్తా శ్రీను, సామర్లకోటకు చెందిన కె. శ్రీను, చిటికెల లక్ష్మి ఉన్నట్లు గుర్తించామన్నారు. 

ప్రాథమిక విచారణ ప్రకారం, పొలాల మధ్యలో 6 షెడ్లు వేసి బాణసంచా తయారు చేస్తున్నట్లు అధికారులు కనుగొన్నారు. పేలుడు సంభవించడానికి కొద్దిసేపటి ముందే కొంతమంది కార్మికులు భోజనం కోసం బయటకు వెళ్లడంతో వారు ప్రాణాలతో బయటపడ్డారు. పేలుడు తీవ్రతకు వేట్లపాలెం గ్రామంలోని పలు ఇళ్ల అద్దాలు పగిలిపోయాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, పరారీలో ఉన్న యజమాని కోసం గాలిస్తున్నారు.

Related posts

ఆనాడు ఎమ్మెల్యేలను రామకృష్ణ స్టూడియోకు తరలించి క్యాంపు నిర్వహించాల్సి వచ్చింది: సీఎం చంద్రబాబు

Ram Narayana

వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడికి మరో బిగ్ షాక్!

Ram Narayana

భారత్ – పాక్ యుద్ధం… ఆంధ్ర యూనివర్శిటీలో హాస్టళ్ల మూసివేత!

Ram Narayana