Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

కేటీఆర్ సీఎం అయితే … ఖమ్మం జిల్లాలో జరిగే మార్పులు ఏమిటి ?

కేటీఆర్ సీఎం అయితే … ఖమ్మం జిల్లాలో జరిగే మార్పులు ఏమిటి ?
-అజయ్ కి ముఖ్య పోర్ట్ ఫొలియో వస్తుందా ?
-రాజకీయ మార్పులు జరిగే ఆవకాశం ఉందా?
-పొంగులేటికి ఇచ్చిన హామీ నిలబెట్టుకొంటారా?
-తుమ్మలను ఏరకంగా ఉపయోగించు కుంటారు.
-సండ్రకు ప్రాతినిధ్యం దక్కుతుందా ?
కేటీఆర్ రేపో మాపో సీఎం కానున్నారని వార్తలు వస్తున్నాయి. దాదాపు ఒకరిద్దరు మినహా మంత్రులందరూ కేటీఆర్ ముఖ్యమంత్రి కాబోతున్నాడు అని బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. అందుకు సీఎంఓ నుంచి ఎలాంటి ఖండనలు లేవు. అందువల్ల సీఎంఓ లీకులవల్లనే కేటీఆర్ సీఎం అవుతారని ప్రచారం జరుగుతుందని ప్రజలు నమ్ముతున్నారు. ప్రతిపక్షాలు కూడా కేటీఆర్ సీఎం అవుతాడని అభిప్రాయాలతో ఉన్నాయి. రాజకీయ పరిశీలకులు సైతం జరుగుతున్న ప్రచారంతో ఏకీబహిస్తున్నారు . ఒక్క బీజేపీ మాత్రం కేటీఆర్ సీఎం అయితే అణుబాంబు విస్ఫోటనం లాగా టీఆర్ యస్ పార్టీ చీలిపోతుందని బాంబు పేల్చింది. బీజేపీ మాటలు ఎలా ఉన్న కేటీఆర్ సీఎం కావడం ఖాయం. కేటీఆర్ వద్దనుకుంటే తప్ప . అందుకు ఆయన అన్నిరకాల సమర్ధుడు , విద్యావంతుడు,చురుకు ,తెలివైనవాడు . ఈటెల రాజేందర్ అన్నట్లు ఇప్పటికే 90 శాతం సీఎం పనులు ఆయనే చూస్తున్నారు. పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ గా ఉన్నారు. పార్టీ వ్యవహారాలపై కూడా పట్టు సాధించాడు. అనేక మంది ఎమ్మెల్యేలు కూడా దీన్ని బలపరుస్తున్నారు. కేసీఆర్ ఆమోదం లేకుండా ఇంతమంది మంత్రాలూ , ఎమ్మెల్యేలు మాట్లాడరు అనేది పరిశీలకుల అభిప్రాయం .

కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే ఖమ్మం జిల్లాలో ఎలాంటి మార్పులు చేసుకుంటాయి… జిల్లా మంత్రి మరింత క్రియాశీలకంగా వ్యవహరించనున్నారా? ప్రాతినిధ్యం ఏమిటి ?మంత్రి అజయ్ కి కేబినెట్ లో ఎలాంటి పోర్ట్ ఫొలియో లభిస్తుంది అనే చర్చ జరుగుతుంది. అజయ్ ప్రస్తుతం రాష్ట్ర రోడ్ రహణశాఖా మంత్రిగా ఉన్నారు. కేటీఆర్ తో అజయ్ కి మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అత్యంత సన్నిహితులలో అజయ్ ఒకరు . దీనితో కేటీఆర్ మంత్రి వర్గంలో కీలక పదవి లభిస్తుందనే అభిప్రాయాలూ ఉన్నాయి. హోమ్, రెవెన్యూ , శాసనసభ వ్యవహారాలు , రోడ్లు మరియి భవనాల లాంటి శాఖలలో ఒకటి లభించే ఆవకాశాలు ఉండవచ్చునని తెలుస్తున్నది . ఇక జిల్లాలో రెండవ మంత్రి పదవి వస్తుందా ? వస్తే ఎవరికీ ఖమ్మం జిల్లా నుంచే ఇస్తారా ? లేక భద్రాద్రికొత్తగూడెం జిల్లా నుంచి ఆవకాశం వస్తుందా? ఖమ్మం జిల్లా నుంచి సత్తుపల్లి శాసన సభ్యుడు సండ్ర వెంకట వీరయ్య కు గతంలోనే కేసీఆర్ ప్రామిస్ చేశారని ప్రచారం జరిగింది. మరి ఇప్పుడు కేటీఆర్ మంత్రి వర్గంలో ఆవకాశం ఉంటుందా ? లేదా? సండ్ర ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి చెందినవాడు కావటంతో చర్చల్లో ఉన్నారు. ఇక కేటీఆర్ ను నమ్ముకున్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పరిస్థితి ఏమిటి ? ఆయనకు ఏమైనా అవకాశాలు ఉంటాయా? మాజీ మంత్రి సీనియర్ నాయకులూ తుమ్మల నాగేశ్వరరావు సేవలను ఏవిధంగా ఉపయోగించుకుంటారు. అనే విషయాన్నీ కూడా జిల్లా ప్రజలు ఆశక్తిగా గమనిస్తున్నారు. బీసీ నాయకుడు వద్దిరాజు రవిచంద్ర అలియాస్ గాయత్రీ రవి బలమైన సామజిక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన ఖమ్మం జిల్లా నుంచి రాజకీయాలు చేయాలనే ఆశక్తి కనబరుస్తున్నాడు. ఇక్కడ నుంచి ఆయనకు అకామిడేషన్ కల్పిస్తారా?లేదా ? అనేది సందేహ స్పదంగా ఉంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా అందులో 7 నియోజకవర్గాలు రిజర్వడ్ కేటగిరిలో ఉన్నాయి. అందులో 5 నియోజకవర్గాలు ఎస్టీ రిజర్వడ్ కాగా , రెండు ఎస్సీ రిజర్వడ్ కేవలం మూడు నియోజకవర్గాలు మాత్రమే జనరల్ కేటగిరిలో ఉన్నాయి. దీంతో నాయకులూ ఎక్కువ నియోజకవర్గాలు తక్కువఉన్న జిల్లాగా ఇది ఉండటం కొంత ఇబ్బంది కరంగా మారింది. మరి ఖమ్మం జిల్లాలో ఉన్న నాయకులను ఏవిధంగా సర్దుబాటు చేస్తారో చూడాల్సిందే.

Related posts

Gadgets | Would You Strap On A VR Headset For Hours?

Drukpadam

మన సుప్రీంకోర్టులో సింగపూర్ సీజే!

Drukpadam

ప్రధానిని తిట్టిపోయడం ‘భావ ప్రకటన స్వేచ్ఛ’ కిందకు రాదు: అలహాబాద్ హైకోర్ట్ స్పష్టీకరణ!

Drukpadam

Leave a Comment