హైద్రాబాద్ వార్తలు

ఎల్బీనగర్ ఫ్లైఓవర్‌పై కారు బీభత్సం.. డీసీఎంను ఢీకొట్టడంతో మంటలు…

  • మద్యం మత్తులో కారును అతివేగంగా నడిపిన యువకులు
  • ముందు వెళుతున్న డీసీఎంను ఢీకొట్టి డివైడర్ ను తాకిన కారు
  • కారు పూర్తిగా దగ్ధం.. ప్రమాదం నుంచి బయటపడ్డ యువకులు

హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ సాగర్ రింగ్ రోడ్డు ఫ్లైఓవర్‌ పై ఈ రోజు తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఉన్న కొందరు యువకులు మితిమీరిన వేగంతో కారును నడుపుతూ, అదుపుతప్పి ముందు వెళ్తున్న డీసీఎం వ్యాన్ ను ఢీకొట్టారు. ఈ ధాటికి కారు ఫ్లైఓవర్ డివైడర్‌ను తాకడంతో నిప్పురవ్వలు చెలరేగి కారు మొత్తం మంటల్లో చిక్కుకుంది.

ఫైరింజన్ వచ్చే లోపే..
ప్రమాద తీవ్రతకు కారు ఇంజిన్ భాగంలో మంటలు వేగంగా వ్యాపించాయి. స్థానికులు వెంటనే అప్రమత్తమై అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేలోపే కారు పూర్తిగా కాలిపోయింది. అదృష్టవశాత్తూ కారులోని యువకులు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నప్పటికీ తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ ఘటనతో ఫ్లైఓవర్‌పై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మద్యం మత్తులో కారును మితిమీరిన వేగంతో నడపడమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని ప్రాథమిక విచారణలో తేలింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related posts

చైతన్యపురిలో ఈటల రాజేందర్ ర్యాలీ… మొరపెట్టుకున్న మూసీ నిర్వాసితులు…

Ram Narayana

నార్సింగిలో ఘోరం: ఎనిమిదో తరగతి బాలికపై గ్యాంగ్ రేప్…

Ram Narayana

అయ్యో హైదరాబాద్… ఫుడ్ సర్వేలో అట్టడుగు స్థానం…

Ram Narayana