తెలంగాణ రాజకీయ వార్తలు ..

సీనియర్ నేత వి.హనుమంతరావును కలిసిన రాజ్యసభ అభ్యర్థి వేం నరేందర్ రెడ్డి…

  • రాజ్యసభ టిక్కెట్ ఆశించి భంగపడిన వి.హనుమంతరావు
  • ఇప్పటికే నామినేషన్ దాఖలు చేసిన వేం నరేందర్ రెడ్డి
  • సీనియర్ నాయకులను కలవాలని నిర్ణయించుకున్న వేం నరేందర్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థిగా ఎంపికైన వేం నరేందర్ రెడ్డి పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ వి. హనుమంతరావును మర్యాదపూర్వకంగా కలిశారు. వేం నరేందర్ రెడ్డి రాజ్యసభ ఎన్నికల కోసం నామినేషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో పార్టీలోని సీనియర్ నాయకులను కలవాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా వీహెచ్ నివాసానికి చేరుకున్నారు. భవిష్యత్తులో పార్టీ కార్యక్రమాల్లో కలిసి పనిచేసే అంశాలపై వారు చర్చించారని తెలుస్తోంది.

రాజ్యసభ టిక్కెట్ ఆశించిన వారిలో వి. హనుమంతరావు కూడా ఉన్నారు. ఆయన కొన్నిరోజుల క్రితం ఢిల్లీకి వెళ్లి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి కె.సి. వేణుగోపాల్ తదితరులను కలిసి టిక్కెట్ కోసం అభ్యర్థించారు.

అయితే పార్టీ అధిష్ఠానం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్నిహితుడైన వేం నరేందర్ రెడ్డికి టిక్కెట్ కేటాయించింది. ఈ నేపథ్యంలో టిక్కెట్ ఆశించి భంగపడిన నాయకులు, సీనియర్ నాయకులను కలవాలని వేం నరేందర్ రెడ్డి నిర్ణయించుకున్నారు.

Related posts

అక్బరుద్దీన్ ఒవైసీని వచ్చేసారి కొడంగల్ నుంచి పోటీ చేయించి.. డిప్యూటీ సీఎం చేస్తా: రేవంత్ రెడ్డి

Ram Narayana

స్వతంత్రుల ముసుగులో వస్తే నమ్మకండి…మంత్రి పొంగులేటి

Ram Narayana

బీఆర్ యస్ లో ఇంచార్జీలపైనే గెలుపు భాద్యతలు …

Ram Narayana