జాతీయ వార్తలు

ఛత్తీస్‍గఢ్‌లో భారీ ఎన్ కౌంటర్…

ఛత్తీస్‍గఢ్‌లో భారీ ఎన్ కౌంటర్…

మావోయిస్టులు భారీ స్థాయిలో లొంగిపోయారు …ఇక కేంద్రకమిటీ కార్యదర్శి దేవీజీ అలియాస్ తిరుపతి తో సహా అనేకమంది కేంద్ర పొలిట్ బ్యూరో సభ్యులు , కేంద్ర కమిటీ సభ్యులు , దళాల కమాండర్లు ఏరియా డివిజన్ కమిటీ నాయకులూ వేలాది మంది లొంగిపోయారు ..అయితే మరికొంతమంది ఇంకా అడువుల్లోనే ఉన్నారు …వారిని కూడా లొంగిపొమ్మని అంటూ ప్రభుత్వాలు , లొంగిపోయిన నాయకులు పిలుపులు ఇస్తున్నారు .. ఇక సాయుధ పోరాటం మార్గం కాదని ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా పేదల కోసం లీగల్ గానే పని చేయాలనే అభిప్రాయానికి వచ్చినప్పటికీ మరికొంతమంది అడవులలో ఉండటం వారిని అంతం చేయాలనే పట్టుదలతో కేంద్రం వ్యూహరచన చేయడం తో ఎన్కౌంటర్లు ఆగడంలేదు …చివరకు మావోయిస్టు అగ్రనేత గణపతి అలియాస్ ముప్పాళ్ల లక్ష్మణ్ రావు కూడా ఇంకా లొంగిపోల్వాల్సి ఉంది ..అయన అడవుల్లో లేరని పక్క సమాచారం ఉన్నప్పటికీ ఆరోగ్య రీత్యా చికిత్స పొందుతున్నారని అంటున్నారు …ఇప్పటికే మావో ఆలోచన విధానం భారత దేశ పరిస్థితులకు పనికి రాదని నిర్దారణకు వచ్చిన వారు లొంగిపోయారు ..మిగతా వారు కూడా లొంగిపోతే మంచిదనే అభిప్రాయాలు ఉన్నాయి.

ఛత్తీస్‌గఢ్‌లోని నార్త్ బస్తర్ కోయిల్ బేడలో భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. మావోయిస్టులు ఉన్నారనే పక్కా సమాచారంతో భద్రతా దళాలు కూంబింగ్ చేపట్టాయి. నిన్న సాయంత్రం అనుమానిత ప్రదేశాన్ని చుట్టుముట్టగానే మావోయిస్టులు కాల్పులు జరపడంతో భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులు జరిపినట్లు కాంకెర్ ఎస్పీ నిఖిల్ రఖేచా తెలిపారు. ఆపరేషన్ కగార్ ప్రభావంతో మావోయిస్టు పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.

Related posts

సోనియా గాంధీ వ్యాఖ్యలపై స్పందించిన రాష్ట్రపతి కార్యాలయం!

Ram Narayana

కేరళ ద గ్రేట్ ..తీవ్ర పేదరికం లేని రాష్ట్రంగా డిక్లర్ …!

Ram Narayana

ఎంపీల సస్పెన్షన్‌‌పై తీవ్రంగా స్పందించిన కాంగ్రెస్ నేత మల్లు రవి

Ram Narayana