Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలు

కేరళ ద గ్రేట్ ..తీవ్ర పేదరికం లేని రాష్ట్రంగా డిక్లర్ …!

తీవ్ర పేదరికానికి చరమగీతం.. దేశంలోనే తొలి రాష్ట్రంగా కేరళ

  • కేరళలో తీవ్ర పేదరికాన్ని నిర్మూలించినట్టు ప్రభుత్వ ప్రకటన
  • అసెంబ్లీలో అధికారికంగా వెల్లడించిన సీఎం పినరయి విజయన్
  • ఈ ఘనత సాధించిన దేశంలోనే తొలి రాష్ట్రం తమదేనన్న ప్రభుత్వం
  • 2021లో ప్రారంభించిన ప్రత్యేక ప్రాజెక్టు ద్వారా ఈ విజయం
  • క్షేత్రస్థాయి సర్వేలతో 64,006 పేద కుటుంబాలను గుర్తించి ఆదుకున్న సర్కార్
  • నీతి ఆయోగ్ నివేదిక తర్వాత మిగిలిన పేదలపై దృష్టి సారించినట్టు వెల్లడి

కేరళ రాష్ట్రం ఒక చారిత్రక మైలురాయిని అందుకుంది. రాష్ట్రంలో తీవ్ర పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించినట్టు ముఖ్యమంత్రి పినరయి విజయన్ అధికారికంగా ప్రకటించారు. కేరళ ఆవిర్భావ దినోత్సవమైన నవంబర్ 1న, శనివారం నాడు శాసనసభ వేదికగా ఆయన ఈ ప్రకటన చేశారు. ఈ ఘనత సాధించిన దేశంలోనే తొలి రాష్ట్రం కేరళ అని ఎల్డీఎఫ్ ప్రభుత్వం స్పష్టం చేసింది.

2021లో రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన “తీవ్ర పేదరిక నిర్మూలన ప్రాజెక్టు” విజయవంతం కావడంతో ఈ ఫలితం సాధ్యమైంది. ఈ ప్రాజెక్టు కింద రాష్ట్రవ్యాప్తంగా 64,006 కుటుంబాలను ‘అత్యంత నిరుపేద’ కుటుంబాలుగా గుర్తించారు. ఆ తర్వాత వారిని పేదరికం నుంచి బయటకు తీసుకువచ్చేందుకు నాలుగేళ్ల లక్ష్యంతో ప్రత్యేక పథకాలను అమలు చేశారు.

ఈ విజయం వెనుక ఉన్న ప్రణాళికను స్థానిక స్వపరిపాలన శాఖ మంత్రి ఎం.బి.రాజేశ్ ఇటీవల వివరించారు. నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం దేశంలోనే అత్యల్ప పేదరిక రేటు (0.7 శాతం) కేరళలో ఉందని తేలిందని, అయితే ఆ కొద్దిమందిని కూడా ఆదుకోవాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని ఆయన తెలిపారు. ఆహారం, ఆరోగ్యం, నివాసం, జీవనోపాధి వంటి సూచికల ఆధారంగా క్షేత్రస్థాయిలో సర్వేలు నిర్వహించి అత్యంత నిరుపేదలను గుర్తించినట్టు చెప్పారు.

ఈ సర్వేల ద్వారా 64,006 కుటుంబాలకు చెందిన 1,03,099 మందిని గుర్తించి వారికి అవసరమైన అన్ని రకాల సహాయాన్ని ప్రభుత్వం అందించింది. ఈ కేంద్రీకృత ప్రణాళిక ఫలితంగానే ఇప్పుడు రాష్ట్రంలో తీవ్ర పేదరికం అనేది గతంగా మారిందని ప్రభుత్వం చెబుతోంది.

Related posts

కర్ణాటక సీఎం సిద్ధరామయ్యపై కేసు నమోదు!

Ram Narayana

శాంతి చర్చలకు పిలుపునించిన భూపతి ద్రోహి .. మావోయిస్టు కేంద్రకమిటీ

Ram Narayana

గంజాయికి బానిసై ప్రియుడి ఆత్యహత్య.. అతడి బాటలోనే ప్రియురాలి బలవన్మరణం

Ram Narayana

Leave a Comment