తెలంగాణ వార్తలు

కుదుటపడుతున్న తమ్మినేని ఆరోగ్యం…సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా

సీపీఐ (ఎం) కేంద్రకమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం ఆరోగ్య స్థితిగతులు మెరుగువుతున్నాయి. రెండు రోజుల క్రితం ఆయన ఆరోగ్య పరిస్థితులు క్షీణించడంతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. ఐసీయూ లో ఉంచి చికిత్స అందిస్తున్న వైద్యులు సోమవారం ఆయన్ను కాజువాలిటిలోకి మార్చారు. ఊపిరితిత్తుల సమస్య , మూత్రపిండాల్లో క్రియాటిన్ లెవెల్స్ పెరగడం, రెండుసార్లు గుండెపోటుకు గురికావడం తదితర అనారోగ్య కారణాలతో ఆయన్ను కుటుంబసభ్యులు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చేర్పించారు. వైద్య చికిత్సల అనంతరం ఆయన కోలుకుంటున్నారు. కావున పార్టీ శ్రేణులు ఆందోళన చెందవద్దని పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు సూచించారు. ఆక్సిజన్ తీసుకోవడం మెరుగయ్యాక మరో రెండు రోజుల్లో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసే అవకాశం ఉందని తెలిపారు. తమ్మినేని వీరభద్రాన్ని …ను‌న్నా నాగేశ్వరరావు తో పాటు సీఐటీయూ జాతీయ కోశాధికారి ఎం. సాయిబాబు, సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు, రాష్ట్ర కమిటీ సభ్యులు బండి రమేష్, అన్నవరపు కనకయ్య, జిల్లా కమిటీ సభ్యులు ఎస్. నవీన్ రెడ్డి, నాయకులు వీరబాబు తదితరులు పరామర్శించారు.

Related posts

ప్రైవేటు’లో మీకంటే గొప్పవారు ఉన్నారా?: డీఎస్సీ విజేతలతో సీఎం రేవంత్‌

Ram Narayana

కన్నియాకుమారి నుంచి తిరుగుపయనమైన రేవంత్ రెడ్డి!

Ram Narayana

హైదరాబాద్‌లో అక్రమ సరోగసీ రాకెట్… లేడీ డాక్టర్ ను అరెస్ట్ చేసిన ఈడీ..

Ram Narayana