ఆంధ్రప్రదేశ్

ఐఏఎస్ అధికారి డాక్టర్ నీలకంఠ రెడ్డిపై బదిలీ వేటు.. పోస్టింగ్ ఇవ్వకుండా జీఏడీకి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కీలక ఐఏఎస్ అధికారి బదిలీ అయ్యారు. రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ (ఏపీఎస్‌ఏసీఎస్) మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న 2017 బ్యాచ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ కె. నీలకంఠ రెడ్డిని ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయన సేవలను వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. తదుపరి పోస్టింగ్ ఇచ్చేవరకు సాధారణ పరిపాలన శాఖలో (జీఏడీ) రిపోర్ట్ చేయాలని ఆదేశించింది.

ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్ నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని అందులో స్పష్టం చేశారు. ప్రస్తుతం ఖాళీ అయిన ఏపీ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ మేనేజింగ్ డైరెక్టర్ పోస్టుకు అవసరమైన ఇన్‌ఛార్జ్ ఏర్పాట్లు చేయాలని వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శిని ప్రభుత్వం ఆదేశించింది.

Related posts

‘ఆనంద నిలయం అనంత స్వర్ణమయం’ పథకం దాతలకు తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనం!

Ram Narayana

మణిపూర్ హింసను ఖండిస్తూ.. మిజోరంలో రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపిన మిజోరం సీఎం, మంత్రులు

Ram Narayana

కీలకమైన 96 గంటలు: గురువారం నాటికి జలాంతర్గామిలో ఆక్సిజన్ పూర్తి…

Drukpadam