జాతీయ వార్తలు

పశ్చిమాసియా యుద్ధం.. రేపు ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ కీలక సమావేశం…

పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో, ప్రధానమంత్రి నరేంద్రమోదీ రేపు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో సమావేశం కానున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎంలతో మాట్లాడనున్నారు. పశ్చిమాసియాలో 27 రోజులుగా యుద్ధ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. యుద్ధానికి అమెరికా తాత్కాలిక విరామం ప్రకటించినప్పటికీ, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య సంఘర్షణ కొనసాగుతోంది.

సంక్లిష్ట పరిస్థితులు సుదీర్ఘకాలం కొనసాగే అవకాశం

పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న సంక్లిష్ట పరిస్థితులు దీర్ఘకాలం కొనసాగే అవకాశం ఉందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, ఇది అందరికీ పరీక్షా సమయమని అన్నారు. సంక్షోభం నుంచి బయటపడటంలో రాష్ట్రాలన్నీ కేంద్రంతో కలిసి టీమిండియాలా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి ప్రజలు సిద్ధంగా ఉండాలని సూచించారు.

కాగా, అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ సమావేశానికి దూరంగా ఉండనన్నుట్టు తెలుస్తోంది. 

Related posts

ఎట్టకేలకు ప్రధాని మోడీ మణిపూర్ పర్యటన…

Ram Narayana

ప్రధాని మోదీతో రక్షణ కార్యదర్శి భేటీ

Ram Narayana

బంగ్లాదేశ్ పరిస్థితులపై అఖిలేశ్ యాదవ్ కీలక వ్యాఖ్యలు…

Ram Narayana