ఆంధ్రప్రదేశ్

ఏపీకి చెందిన రెండు కీలక బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం!

ఏపీకి చెందిన రెండు కీలక బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం!
-ఎస్సీ కమిషన్, విద్యుత్ డ్యూటీ సవరణ బిల్లులకు ఆమోదం
-ఇక ఏపీలో ఎస్సీలకు ప్రత్యేకంగా కమిషన్
-గతంలో బిల్లును ఆమోదించిన ఏపీ అసెంబ్లీ
-ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరు కమిషన్లు

ఏపీకి చెందిన రెండు కీలక బిల్లులు చట్టంగా మారేందుకు మార్గం సుగమం అయింది. ఏపీ ఎస్సీ కమిషన్, ఏపీ ఎలక్ట్రిసిటీ డ్యూటీ సవరణ బిల్లులకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోద ముద్ర వేశారు. ఏపీలో ఎస్సీలు, ఎస్టీల అభ్యున్నతి దిశగా మరింత మెరుగైన కార్యాచరణ కోసం ఏపీ సర్కారు ఎస్సీలకు, ఎస్టీలకు వేర్వేరు కమిషన్లు తీసుకురావాలని సంకల్పించింది. ఆ దిశగా బిల్లు తీసుకురాగా, 2020లో ఏపీ అసెంబ్లీ ఆమోదం పొందింది.

అయితే, ఈ బిల్లుకు శాసనమండలి కొన్ని సిఫారసులు చేయగా, ఆ సిఫారసులు ఆమోదయోగ్యం కాదంటూ ఆ బిల్లును అసెంబ్లీ మరోసారి ఆమోదించి కేంద్రానికి పంపింది. ఇప్పుడీ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం తెలపడంతో రాష్ట్రంలో ఎస్సీలకు ప్రత్యేక కమిషన్ రానుంది. రాష్ట్రపతి నిర్ణయం ఏపీ ప్రభుత్వానికి మరింత ఉత్సాహాన్నిస్తుందనడంలో సందేహంలేదు.

ఆనందం లో జగన్ సర్కార్

కీలకమైన రెండు బిల్లులు ఆమోదం పొందటంపట్ల ఏపీ జగన్ సర్కార్ ఆనందంలో ఉంది. ఏపీ ఎస్సీ కమిషన్, ఏపీ ఎలక్ట్రిసిటీ డ్యూటీ సవరణ బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారని వార్త తో సీఎం జగన్ సంతోషం వ్యక్తం చేశారు.

Related posts

కెన‌డా అడ‌వుల‌ నుంచి వ‌స్తున్న‌ పొగ‌.. నార్వేలోనూ క‌నిపిస్తోంది!

Drukpadam

మన జెండా పీకేస్తాం అన్నోళ్లు అడ్రస్ లేకుండా పోయారు: నారా లోకేశ్

Ram Narayana

రాజీనామా అనంతరం సిద్దుపై నిప్పులు చెరిగిన అమరిందర్!

Drukpadam