అంతర్జాతీయం

అమెరికా విమానాన్ని కూల్చేశాం.. త్వరలో ఒక ‘బిగ్ సర్‌ప్రైజ్’ ఇస్తాం: ఇరాన్

అమెరికాతో ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో ఇరాన్ సంచలన ప్రకటన చేసింది. అమెరికాకు చెందిన సీ-130 రవాణా విమానాన్ని తాము కూల్చివేసినట్లు ఆదివారం వెల్లడించింది. చిక్కుకుపోయిన ఒక అమెరికన్ సైనికుడిని గుర్తించేందుకు యూఎస్ చేపట్టిన ఆపరేషన్ సందర్భంగా ఈ ఘటన జరిగిందని పేర్కొంది. ఈ ఆపరేషన్‌లో భాగంగా గగనతలంలోకి వచ్చిన పలు “ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్”ను కూడా ధ్వంసం చేసినట్లు తెలిపింది.

ఫార్స్ న్యూస్ ఏజెన్సీ కథనం ప్రకారం ఒక ఇరాన్ అధికారి మాట్లాడుతూ అమెరికాకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. “అమెరికాకు, దాని మిత్రపక్షాలకు మా వద్ద ఒక పెద్ద సర్‌ప్రైజ్ ఉంది. దానికి ఎంతో సమయం పట్టదు. దక్షిణ ఇరాన్‌లో వారి ప్రవర్తనను బ‌ట్టి మా ప్రణాళికల సమయాన్ని మరింత ముందుకు జరిపే అవ‌కాశం ఉంది” అని ఆయన హెచ్చరించారు. అమెరికా సైనిక ఆపరేషన్లు విఫలమయ్యాయని, వారి టార్గెట్ కచ్చితమైంది కాదని ఎద్దేవా చేశారు.

“అసమాన యుద్ధ తంత్రంలో శత్రువును ఎలా బలహీనపరచాలో మాకు బాగా తెలుసు. సులభంగా, వేగంగా దాడి చేయాలనే అమెరికా వ్యూహం విఫలమైంది” అని ఆ అధికారి వ్యాఖ్యానించారు.

ఇదే సమయంలో అబుదాబిలోని బోరూజ్ పెట్రోకెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గగనతలంలో దాడులను విజయవంతంగా అడ్డుకున్న తర్వాత, వాటి శకలాలు ఫ్యాక్టరీపై పడటంతో మంటలు చెలరేగినట్లు స్థానిక అధికారులు తెలిపారు. ఈ ఘటనతో పశ్చిమాసియాలో ఉద్రిక్త వాతావరణం మరింత తీవ్రమైంది.

Related posts

అమెరికా ఒత్తిడికి తలొగ్గేది లేదన్న ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ..!

Ram Narayana

ఫ్యామిలీ మెంబర్ స్పాన్సర్ వీసాకు ఆదాయ పరిమితిని 55 శాతం పెంచిన యూకే…

Ram Narayana

దివాలా తీసిన అమెరికా దిగ్గజ సంస్థ..

Ram Narayana