అట్టహసంగా డిప్యూటీ సీఎం భట్టి కుమారుడి వివాహ రిసెప్షన్ వేడుక
భారీగా తరలివచ్చిన భట్టి అభిమానులు
అధికారులు ప్రజాప్రతినిధులు వివిధ పార్టీల నేతలు
సం ద్రమైన ఖమ్మం వైయస్సార్ కాలనీ
లక్షమందికి పైగానే ప్రజలు వచ్చారని అంచనా
ప్రధానంగా మధిర మొత్తం రిసిప్షన్ దగ్గరే


రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క – నందిని దంపతుల కుమారుడు సూర్య విక్రమాదిత్య, సాక్షిల వివాహ రిసెప్షన్ వేడుక ఆదివారం అశేష జనవాహిని మధ్య కనుల పండుగగా జరిగింది. నగరంలోని గ్రీన్ హిల్స్, వైయస్సార్ కాలనీ రోడ్ వేదికగా ఉదయం 10 గంటల నుండే ప్రారంభమైన ఈ శుభకార్యం సాయంత్రం వరకు అత్యంత వైభవంగా కొనసాగింది. తమ అభిమాన నాయకుడి కుటుంబ వేడుకను సొంత ఇంటి పండుగగా భావించిన కార్యకర్తలు, అభిమానులు వేలాదిగా తరలిరావడంతో ఖమ్మం నగరం జనసంద్రంగా మారింది. ఈ రిసిప్షన్ కే లక్షమందికి పైగా ప్రజలు తరలి వచ్చారని అంచనా …వచ్చిన వారి నందరిని భట్టి దంపతులు ఆప్యాయంగా పలకరించి విందు ఆరగించి వెళ్లాలని సూచించారు …ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్లు , ఖమ్మం సీపీ భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ ఇతర అధికారులు ఎమ్మెల్యేలు కార్పొరేషన్ చైర్మన్ల్ కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్తలు ప్రధానంగా మధిర నియోజకవర్గం నుంచి అధిక సంఖ్యలు వేలాదిగా తరలి వచ్చారు ..
ఈ రిసెప్షన్ వేడుకకు ఉమ్మడి ఖమ్మం జిల్లా శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, కార్పొరేషన్ చైర్మన్లు, కలెక్టర్లు, వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నత స్థాయి అధికారులు, పోలీసు ఉన్నతాధికారులు హాజరై నూతన వధూవరులను దీవించారు. వీరితో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కీలక రాజకీయ నాయకులు, ప్రముఖులు మరియు వివిధ ప్రజాసంఘాల నాయకులు విచ్చేసి భట్టి విక్రమార్క కుటుంబానికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఒకవైపు రాజకీయ గంభీరం, మరోవైపు అధికారుల సమక్షంతో వేదిక ప్రాంగణం కళకళలాడింది.
లక్ష మందికి పైగా అతిథులు.. పకడ్బందీ ఏర్పాట్లు
ముందుగా అంచనా వేసినట్లుగానే సుమారు లక్ష మందికి పైగా జనం ఈ వేడుకకు హాజరయ్యారు. ముఖ్యంగా మధిర నియోజకవర్గంలోని ప్రతి పల్లె నుండి వచ్చిన అభిమానుల కోసం భారీ ఎత్తున భోజన వసతులు కల్పించారు. ట్రాఫిక్ నియంత్రణకు పోలీసు యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టగా, వేలాది వాహనాల పార్కింగ్ కోసం భారీ స్థలాలను కేటాయించారు. ఇంతటి భారీ జనసందోహం ఉన్నప్పటికీ, ఎక్కడా అసౌకర్యం కలగకుండా వాలంటీర్లు, కార్యకర్తలు పర్యవేక్షించడం విశేషం.
ప్రజల కోసమే ఖమ్మం వేదికగా..
గత నెల మార్చి 5న హైదరాబాద్‌లో వివాహం జరిగినప్పటికీ, తనను రాజకీయంగా పెంచి పెద్ద చేసిన నియోజకవర్గ ప్రజల మరియు స్థానిక అభిమానుల ఆశీస్సుల కోసమే ఈ కార్యక్రమాన్ని ఖమ్మంలో నిర్వహించారు. “మా కుటుంబ వేడుకకు విచ్చేసి నూతన వధూవరులను దీవించి, విందును స్వీకరించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు” అని భట్టి విక్రమార్క – నందిని దంపతులు తెలిపారు. సామాన్య కార్యకర్త నుండి జిల్లా స్థాయి అధికారుల వరకు అందరూ ఒకే వేదికపై పాలుపంచుకున్న ఈ వేడుక, ఖమ్మం జిల్లాలో ఒక మరపురాని స్మృతిగా నిలిచిపోయింది.