Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

విమాన సర్వీసులు పునరుద్ధరించండి.. భారత్ కు తాలిబన్ ప్రభుత్వ విన్నపం…

విమాన సర్వీసులు పునరుద్ధరించండి.. భారత్ కు తాలిబన్ ప్రభుత్వ విన్నపం…
-ఖతార్ సాంకేతిక సహాయాన్ని అందించింది
-కాబూల్ విమానాశ్రయాన్ని పునరుద్ధరించామని వెల్లడి
-తొలిసారి అధికారికంగా సంప్రదింపులు జరిపిన తాలిబన్ ప్రభుత్వం

తాలిబన్లు అధికారంలోకి వచ్చిన తరువాత అంతర్జాతీయంగా నేక దేశాలు విమానాలు నడపటం లేదు. పాకిస్తాన్ లాంటి కొన్ని దేశాలు మాత్రమే విమాన సర్వీసులు నడుపుతున్నాయి. తాలిబన్ల ప్రభుత్వాన్ని అనేక దేశాలు అంగీకరించడంలేదు . భారత్ కూడా తాలిబన్ ప్రభత్వాన్ని గుర్తించే విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. అందువల్ల తాలిబన్లు అధికారికంగా పొరవిమానాయన మంత్రిత్వ శాఖ నుంచి లేఖ అందింది . దీనిపై భారత్ విదేశాంగ శాఖ ఎలాంటి నిర్ణయం వెల్లడిస్తుందో అనే ఆశక్తి నెలకొన్నది .

భారత ప్రభుత్వంతో ఆఫ్ఘనిస్థాన్ లోని తాలిబన్ల ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది. రెండు దేశాల మధ్య కమర్షియల్ విమాన సర్వీసులను పునరుద్ధరించాలని భారత్ ను కోరింది. ఈ మేరకు మన డీజీసీఏకు ఆఫ్ఘనిస్థాన్ పౌరవిమానయాన శాఖ లేఖ రాసింది. ఆప్ఘనిస్థాన్ లో తాలిబన్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత భారత్ తో అధికారికంగా సంప్రదింపులు జరపడం ఇదే ప్రథమం. ఆప్ఘనిస్థాన్ పౌరవిమానయాన శాఖ తాత్కాలిక మంత్రి హమీదుల్లా పేరిట ఈ లేఖ అందింది.

‘అమెరికా దళాలు ఆప్ఘనిస్థాన్ నుంచి వెళ్లే సమయంలో కాబూల్ ఎయిర్ పోర్ట్ ధ్వంసమైంది. దీంతో విమానాశ్రయంలో కార్యకలాపాలు ఆగిపోయాయి. అయితే ఖతార్ అందించిన సాంకేతిక సహాయంతో విమానాశ్రయాన్ని పునరుద్ధరించాం. భారత్, ఆఫ్ఘనిస్థాన్ దేశాల మధ్య విమానాల రాకపోకలు జరగాలని కోరుకుంటున్నాం’ అని లేఖలో తాలిబన్ ప్రభుత్వం విన్నవించింది.

Related posts

ఇద్దరికి మించి పిల్లలు ఉంటే ఎంపీ, ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలి: ఎన్సీపీ నేత అజిత్ పవార్…

Drukpadam

తూర్పు గోదావరి జిల్లా టీడీపీలో భగ్గుమన్న విభేదాలు!

Drukpadam

ట్యాంక్ బండ్ వద్ద ఆమరణ దీక్షకు దిగిన షర్మిల!

Drukpadam

Leave a Comment