Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ప్రమాదాలు ...

మాదాపూర్‌లోని హోటల్లో భారీ అగ్ని ప్రమాదం!

  • డీమార్ట్ ఎదురుగా ఉన్న కృష్ణాస్ కిచెన్ రెస్టారెంట్‌లో ప్రమాదం
  • మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నం
  • చుట్టుపక్కల భారీగా అలుముకున్న మంటలు

హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఓ హోటల్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఇక్కడి డీమార్ట్ ఎదురుగా ఉన్న కృష్ణాస్ కిచెన్ రెస్టారెంట్‌లో ఈరోజు మధ్యాహ్నం ప్రమాదం జరిగింది. ప్రమాదం విషయం తెలియగానే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోంది. అగ్ని ప్రమాదం కారణంగా ఆ చుట్టుపక్కల భారీగా పొగ అలుముకుంది. గ్యాస్ సిలిండర్ పేలడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని కథనాలు వస్తున్నాయి. దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.

Related posts

ఒమన్ తీరంలో చమురు నౌక బోల్తా.. 13 మంది భారతీయులు సహా 16 మంది గల్లంతు

Ram Narayana

బాణసంచా ఫ్యాక్టరీలో ఘోర అగ్నిప్రమాదం… 8 మంది మృతి

Ram Narayana

పట్టాలు తప్పిన చార్మినార్ ఎక్స్ ప్రెస్.. నాంపల్లి స్టేషన్ లో ఘటన

Ram Narayana

Leave a Comment