Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

భద్రాచలం వద్ద గోదావరి పై బ్రిడ్జి నిర్మాణం ఎలా జరిగిందో మీకు తెలుసా ….?

 

-భద్రాచలం గోదావరి నది మీద బ్రిడ్జి నిర్మాణం ఎలా జరిగింది ???

-భద్రాచలం వద్ద బ్రిడ్జి నిర్మాణం కు పెద్ద స్టోరీ ఉంది…

-1957 / ఏప్రిల్ పదో తారీఖున జరిగిన భద్రాచలం పడవ ప్రమాదం

 -200 మంది ప్రయాణికులు మరణించారు

-బైరి వెంకట రత్నం తొమ్మిది రోజుల దీక్ష ఫలితమే భద్రాచలం బ్రిడ్జి

 

 

ఇప్పుడు గోదారినది ఒడ్డున ఉన్న భద్రాచలం కు గతంలో బ్రిడ్జి లేదు… శ్రీసీతారాముల దర్శనం కోసం భక్తులు చాల ఇబ్బందులు పడుతూ సద్దిమూటలు చంకన బిడ్డలతో రోజులకొద్దీ నడిచి గోదావరి ఒడ్డుకు చేరుకొని అక్కడనుంచి నాటు పడవల ద్వారా భదరచాలం చేరుకునే వారు. ఖమ్మం నుంచి పోవాలంటే తల్లాడ దాటినా తరువాత పెద్ద పెద్ద అడవులు , అడవి జంతువులూ , అటు ఇల్లందు వారినుంచి వచ్చిన అంతే ఒకరిద్దరు పోవడం కష్టంగా ఉండేది. గుంపులు గుంపులు గా భద్రాచలం చేరుకునే వారు. చేతిలో కాగడాలోతో కాలినడకన అక్కడకు చేరుకునేవారు.

1957 / ఏప్రిల్ పదో తారీఖున జరిగిన భద్రాచలం పడవ ప్రమాదంలో 200 మంది ప్రయాణికులు మరణించారు

1957 / ఏప్రిల్ పదో తారీఖున జరిగిన భద్రాచలం పడవ ప్రమాదం   పడవలో వెక్కి భద్రాచలం చేరుకునేందుకు బయలు దేరారు . ఆ పడవ నది మధ్యలోకి వెళ్లిన తరువాత అదుపు తప్పి మునిగిపోయింది. ఈ ప్రమాదంలో 200 మంది ప్రయాణికులు నీటమునిగి చనిపోయారు. దీనిపై అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రధాని , రాష్ట్రపతి సైతం తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. దీంతో వెంటనే రాష్ట్ర ప్రభుత్వం గోదావరి నదిపై భద్రాచలం వద్ద బ్రిడ్జి కట్టాలని నిర్ణయించింది. భద్రాచలం వద్ద గోదావరి నదిపై ప్రస్తుతం ఉన్న బ్రిడ్జిని రూ.70 లక్షల వ్యయంతో పూర్తి చేశారు. 1959 డిసెంబర్ 16న అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి ఈ పనులకు శంకుస్థాపన చేయగా, 1965 జులై 13న రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ ప్రారంభించారు. 3934 అడుగుల పొడవు, 37 పిల్లర్లు, ఒక్కో పిల్లర్ మధ్య 106.6 అడుగుల దూరంతో బ్రిడ్జి నిర్మించారు. ఇప్పటికీ ఇది పటిష్టంగానే ఉన్నప్పటికీ ఇది జాతీయ రహదారి అయినందున భవిష్యత్‌లో రవాణా అవసరాల దృష్ట్యా మరో బ్రిడ్జి నిర్మించాలని జిల్లా అధికారులు ప్రతిపాదనలు పంపడంతో కేంద్రం నిధులు మంజూరు చేయగా, పనులు మొదలయ్యాయి. అప్పట్లో బ్రిడ్జి నిర్మాణానికి 70 లక్షలు ఖర్చు కాగా , ఇప్పుడు నిర్మిస్తున్న రెండవ బ్రిడ్జి కి 80 కోట్ల అంచనాలతో పనులు ప్రారంభించారు. 2016 నాటికీ పూర్తీ కావలసిన బ్రిడ్జి 2021 పూర్తీ కావస్తున్నా నిర్మాణం మాత్రం పూర్తీ కాలేదు….

భద్రాచలం గోదావరి నది మీద బ్రిడ్జి నిర్మాణం ఎలా జరిగింది ???

చరిత్ర కూడా ఒక్కొక్కప్పుడు తప్పులు చేస్తూ ఉంటుంది, ప్రజాజీవితంలో ఉండి ఆస్తిపాస్తులను ప్రజా పోరాటాల కోసం తృణప్రాయంగా ఖర్చు చేసిన త్యాగధనుల చరిత్ర మరుగున పడి పోతూ ఉంటుంది. అలాంటి చరిత్రకారులు చాలామంది మన రామాపురం గడ్డపై ఉండడం వారి త్యాగాలను గుర్తు చేసుకోవడం మన కర్తవ్యం అని భావిస్తున్నాను ఇలాంటి వారిలో బైరి వెంకటరత్నం కూడా ఒకరు.


 బైరి వెంకట రత్నం ………

రామవరం బస్టాండ్ లో కూల్ డ్రింక్ షాప్ యజమాని,
వెంకటరత్నం తెల్ల దోతి తెల్లటి పంచ తో చూడగానే రాజకీయ నాయకుడిలా ఉండేవారు. దానికి తోడు కంచు కంఠం,  కొత్తగూడెం కేంద్రంగా జరిగిన స్వతంత్ర పోరాటం రజాకార్ల మూమెంట్లో పాల్గొని ఆస్తిపాస్తులను త్యాగం చేసి ప్రజా సోషలిస్టు పార్టీ పాల్వంచ తాలూకా కార్యదర్శిగా సేవలందించారు. ఆయన సేవలకు సంబంధించి ఒక ఒక సంఘటన మీ ముందుంచుతున్నాను.


1957 / ఏప్రిల్ పదో తారీఖున జరిగిన భద్రాచలం పడవ ప్రమాదంలో 200 మంది ప్రయాణికులు మరణించారు దీనిపై సోషలిస్ట్ పార్టీ తరపున భద్రాచలం వద్ద తొమ్మిది రోజులు నిరాహార దీక్ష చేసి వెంకట రత్నం  కేంద్రానికి ఒక వినతి పత్రం సమర్పించారు. దానిపై కేంద్ర ప్రభుత్వం వన్ తక్షణమే స్పందించి భద్రాచలం గోదావరి నదిపై బ్రిడ్జి నిర్మించాలని పడవ ప్రమాదంలో మరణించిన 200 మందికి ఫెర్రీ చట్టం కింద నష్ట పరిహారం చెల్లించాలని శ్రీ వెంకట వెంకట రత్నం గారు పెట్టిన వినతిపత్రంపై కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అంతేకాక భద్రాచలం వద్ద రైలు రోడ్డు బ్రిడ్జి నిర్మాణం అయినా తరువాత దానిపై రైలు ప్రయాణం భద్రాచలం రోడ్డు వరకు రైల్వే ట్రాక్ ఏర్పాటు చేయవలసిందిగా కేంద్ర రవాణా శాఖ సహాయ మంత్రి నారాయణ రావు వన్ రాష్ట్ర ప్రభుత్వానికి లిఖితపూర్వకంగా ఆదేశాలు జారీ చేసింది రామవరం ప్రాంతానికి చెందిన వెంకటరత్నం కృషి నాటి రాజకీయ నాయకుల లో ఎంతో గొప్పగా నిలిచింది.


1957 లో ప్రజా సోషలిస్టు పార్టీ తరఫున ఆయన కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిన వినతి పత్రం నేడు సకల భోగాలతో భద్రాచలం గోదావరి బ్రిడ్జి రంగ రంగ వైభవంగా ప్రజా రవాణా బ్రిడ్జి గా సేవలందించడంలో మన రామవరం కూడా గర్వకారణం కదా…
70 సంవత్సరాల క్రితమే రాజకీయంగా ఎంతో చతురత తో అనర్గళంగా మాట్లాడే శ్రీ వెంకట రత్నం మన ప్రాంతవాసి కావడం నాటి తరానికి నేటి తరానికి స్ఫూర్తిదాయకం.

ఆ రకంగా భద్రాచలం కు బ్రిడ్జి వచ్చింది. దీంతో భద్రాచల పట్టణానికి చేరుకునేందుకు బస్ ప్రయాణం అందుబాటులోకి వచ్చింది.

 

Related posts

రూ. 10,716 కోట్ల లాటరీ.. బహుమతి తగిలినవాళ్లు ఇంకా చూసుకోలేదు..

Drukpadam

యూపీలోని రాంపూర్ లో రాత్రుళ్లు వచ్చి కాలింగ్ బెల్ కొడుతున్న స్త్రీ!

Drukpadam

భగ్గుమంటున్న నిరసన జ్వాలలు… అగ్నిపథ్ పై సమీక్ష చేపట్టిన రాజ్ నాథ్ సింగ్

Drukpadam

Leave a Comment