Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

సమస్యల పరిస్కారం కోసం పీడీఎస్ యూ ఆధ్వరంలో ఖమ్మం కలక్టరేట్ ముట్టడి!

సమస్యల పరిస్కారం కోసం పీడీఎస్ యూ ఆధ్వరంలో ఖమ్మం కలక్టరేట్ ముట్టడి!

-ఖమ్మం కలెక్టరేట్ కు కదంతొక్కిన విద్యార్థులు….
-ఖమ్మం నగరంలో PDSU అధ్వర్యంలో ప్రదర్శన
-పాఠశాల సమస్యల పరిష్కారంకై ఉవ్వెత్తున ఉద్యమం…

ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి కోసం SC, ST, BC విద్యార్థుల చదువుకునే పాఠశాలల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంకు తగిన మూల్యం చెల్లించక తప్పదని జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అజాద్,వెంకటేశ్ హెచ్చరించారు.

పాత బస్టాండ్ నుండి పాత ఎల్.ఐ.సి కార్యాలయం,zp ముందుగా కలెక్టరేట్ వరకు ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం PDSU ఆధ్వర్యంలో వందలాది విద్యార్థులతో ప్రదర్శనగా వచ్చి నిరసన తెలపడం జరిగింది. అనంతరం గ్రీవెన్స్ డే లో డి.ఆర్.ఓ శిరీషకి సమస్యలతో కూడిన వినతి పత్రం అందజేశారు

విద్యా సంవత్సరం ప్రారంభమై అయిన రోజు నుండి నేటి వరకుఎమ్మెల్యేలు ,ఎమ్మెల్సీలు వారి నియోజకవర్గ లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో సందర్శించకపోవడం శోచనియం అని వారు అన్నారు.పేద విద్యార్థులు చదువుల పట్ల వారు వ్యవహరిస్తున్న తీరు పైన మండిపడ్డారు
ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నియోజకవర్గం అభివృద్ధి నిధులు లో 40 శాతం పాఠశాల విద్య కై ఖర్చు చేయాలని ఉత్తర్వులు ఉన్నా అమలు చేయకుండా నిర్లక్షం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలలో ఎప్పుడూ చేరని విధంగా అధిక సంఖ్య విద్యార్థులు ఈ విద్యా సంవత్సరం చేరుతుంటే కనీసం ఉపాధ్యాయులు ఏర్పాటు చేయకుండా తాత్కాలికంగా ఉన్న విద్యావలంటీర్లను కూడా తీసివేయడం ప్రభుత్వ ద్వంద నీతికి నిదర్శనం అన్నారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో శుభ్రం చేసే శానిటైజింగ్ కార్మికులను సైతం తీసి వేయడం మున్సిపాల్ కార్మికులకు అప్పగించి చేతులు దులుపుకుంటున్నారు. దాని వలన ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా పాఠశాలలు ఉన్నాయి అని వారు ఆగ్రహాం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం సక్రమంగా పెట్టడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యా రంగ సమస్యలు పరిష్కరించాలని ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పీడీఎస్ యూ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం నిర్వహిస్తామని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షులు జి మస్తాన్’ జిల్లా కోశాధికారి నవ్య’ జిల్లా నాయకులు దీపిక, శేశి,మురళి, సతీష్, వినయ్’ ‘శివ సాయి ,రవి, శ్రీకాంత్ ,నవీన్, తదితరులు పాల్గొన్నారు.

Related posts

పెళ్లి కాకపోతే అబార్షన్ చేయించుకోవచ్చు.. సుప్రీం కోర్ట్ సంచలన తీర్పు!

Drukpadam

ప్రియుడి కోసం పాకిస్థాన్ వెళ్లిన భారతీయ మహిళ.. భర్తకు షాక్

Ram Narayana

ఒమిక్రాన్ ఎఫెక్ట్ కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…

Drukpadam

Leave a Comment