Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఖమ్మాన్ని విద్యారంగం హబ్ గా చేస్తానన్నసీఎం ఇచ్చిన హామీ ఏమైంది?;ఎస్ ఎఫ్ ఐ

ఖమ్మాన్ని విద్యారంగం హబ్ గా చేస్తానన్నసీఎం ఇచ్చిన హామీ ఏమైంది?;ఎస్ ఎఫ్ ఐ
-ఖమ్మం కేంద్రంగా యూనివర్సిటీని ఏర్పాటు చేయాలి
-ప్రభుత్వ మెడికల్ యూనివర్సిటీ, నర్సింగ్ కళాశాలను ఏర్పాటు చేయాలి
-పెండింగ్లో ఉన్న ఉపకారవేతనాలు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలి
-కలెక్టరేట్ వద్ద జరిగిన ధర్నాలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అశోక్

తెలంగాణ రాష్ట్రంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఖమ్మం నగరంలో విద్యారంగాన్ని అభివృద్ధి చేస్తానన్న సీఎం కేసీఆర్ మాట తప్పడంపై ఎస్ ఎఫ్ ఐ భగ్గుమన్నది . ఖమ్మం ను విద్యారంగ హబ్ గా ఖమ్మం ను అభివృద్ధి చేయాలనీ అందుకు ఖమ్మం కు వెంటనే మెడికల్ యూనివర్సిటీ , జనరల్ యూనివర్సిటీ , నరిసింగ్ కళాశాలలు ఏర్పాటు చేయాలనీ ఎస్ ఎఫ్ ఐ డిమాండ్ చేసింది. ఈమేరకు శనివారం ఖమ్మం కలెక్టర్ కార్యాలయానికి సంఘం ఆధ్వరంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి జమ్మి అశోక్ మాట్లాడుతూ, పాలకవర్గాలు కావాలని ఇచ్చిన వాగ్దానాలు మరిచి ఖమ్మం జిల్లా విద్యార్థి లోకాన్ని మోసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు., రెండు వందల డిగ్రీ కాలేజీలు పై ఉన్న ఉమ్మడి ఖమ్మం జిల్లా కి ఒక యూనివర్సిటీ మెడికల్ యూనివర్సిటీ లేకపోవడం పాలకుల నిర్లక్షానికి నిదర్శనమని ధ్వజమెత్తారు . ఖమ్మం జిల్లా ని ఎడ్యుకేషన్ హబ్ గా తయారు చేయడంలో ప్రభుత్వం లో ఉన్న పాలకవర్గ ప్రతినిధులు వైఖరిపై మండిపడ్డారు . ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ప్రతి సంవత్సరం 35 వేల మందికి పైగా విద్యార్థులు ఉన్నత విద్య కోసం ఇతర రాష్ట్రాలు మరియు కాకతీయ యూనివర్సిటీ. ఉస్మానియా యూనివర్సిటీ లకు చదువుకోవడానికి వెళ్తున్నారని అన్నారు. మరికొంతమంది విద్యార్థులు పై చదువులకి వెళ్లలేక విద్యకు దూరం అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు . ఎన్నికల సమయంలో కెసిఆర్ ఖమ్మం జిల్లా కి యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి హామీలు నిలబెట్టుకోలేదని విమర్శించారు.

2018 నుంచి 20 వరకు పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం కరోనా కారణంగా విద్యాసంస్థలను మధ్యలోనే మూసి వేశాం అనే కారణం తో ఉపకార వేతనాలు సగమే ఇవ్వడం మరీ సిగ్గుచేటని అన్నారు, వెంటనే ప్రతి విద్యార్థికి పూర్తి స్థాయిలో 4500 రూపాయలు స్కాలర్షిప్ అందించాలని డిమాండ్ చేశారు.

Related posts

కేంద్ర ప్రభుత్వ వైఖరే మా వైఖరి …విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ యాజమాన్యం!

Drukpadam

పోరాటాల ద్వారానే సమస్యల పరిష్కారం: జస్టిస్‌ చంద్రు

Drukpadam

షారుఖ్ కుమారుడికి కోర్టులో మరోసారి నిరాశ!

Drukpadam

Leave a Comment