Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఒకే వేదికపై పక్కపక్కనే కోమటిరెడ్డి, రేవంత్ రెడ్డి…

ఒకే వేదికపై పక్కపక్కనే కోమటిరెడ్డి, రేవంత్ రెడ్డి…
-రెండ్రోజుల వరి దీక్ష చేపట్టిన తెలంగాణ కాంగ్రెస్
-ధర్నా చౌక్ వద్ద కాంగ్రెస్ శ్రేణుల దీక్ష
హాజరైన కాంగ్రెస్ అగ్రనేతలు
-ఉల్లాసంగా మాట్లాడుకుంటూ కనిపించిన రేవంత్, కోమటిరెడ్డి
-వరి కొనకపోతే కేసీఆర్, మోదీలను ఉరితీయడం ఖాయం: రేవంత్ రెడ్డి
-ధర్నా చౌక్ వద్ద కాంగ్రెస్ వరి దీక్ష
-సీఎం కేసీఆర్ పై ధ్వజం
-కేసీఆర్ గద్దె దిగాల్సి ఉంటుందని హెచ్చరిక

ధాన్యం కొనుగోలు అంశం ప్రధాన అజెండాగా తెలంగాణ కాంగ్రెస్ రెండ్రోజుల పాటు వరి దీక్షకు సిద్ధమైంది. హైదరాబాదులోని ధర్నా చౌక్ వద్ద కాంగ్రెస్ అగ్రనేతలు, పార్టీ శ్రేణులు బైఠాయించాయి. ఈ సందర్భంగా ఎవరూ ఊహించని దృశ్యం కనువిందు చేసింది. నిన్నటిదాకా ఎడమొహం పెడమొహంలా ఉన్న ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి… నేడు ధర్నా వేదికపై పక్కపక్కనే కూర్చుని అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. అంతేకాదు, వారిద్దరూ ఎంతో హాయిగా నవ్వుతూ మాట్లాడుకోవడం అందరినీ ఆకట్టుకుంది. వారితోపాటు వీహెచ్, ఉత్తమ్ కుమార్ వంటి అగ్రనేతలు కూడా నవ్వులు పంచుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటో సామాజిక మాధ్యమాల్లో అందరినీ ఆకర్షిస్తోంది.

తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ గా రేవంత్ రెడ్డి బాధ్యతలు అందుకున్నాక కోమటిరెడ్డి పార్టీ కార్యకలాపాలకు కొద్దిమేర దూరం పాటించారు. తన పంథాలో తాను కొనసాగారు. టీపీసీసీ చీఫ్ పదవిని ఆశించిన ఆయన… అది దక్కకపోయే సరికి అసంతృప్తికి గురయ్యారంటూ ప్రచారం జరిగింది.

ధాన్యం కొనుగోలు అంశం తెలంగాణలో తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. దీనిపై స్పందించిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ పై ధ్వజమెత్తారు. రైతుల మృతికి సీఎం కేసీఆరే కారణమని ఆరోపించారు. వరి ధాన్యం కల్లాల్లోనే రైతు గుండె ఆగిపోతున్నా కేసీఆర్ లో చలనం లేదని మండిపడ్డారు. కొనుగోలు కేంద్రాలు తెరవడంలేదని, మద్దతు ధర ఇవ్వడంలేదని ఆగ్రహం వెలిబుచ్చారు. రైతులపై కక్షగట్టిన సీఎం కేసీఆర్ ధాన్యం కొనుగోలు చేయకుండా దళారీగా మారారని విమర్శించారు.

ధాన్యం కొనుగోళ్లపై కేసీఆర్, మోదీ డ్రామాలు ఆడుతున్నారని, వరి కొనకపోతే వారిద్దరినీ ఉరితీయడం ఖాయమని అన్నారు. కేసీఆర్, మోదీ ఇద్దరూ వేరు కాదని, ఒకరు సారా అయితే మరొకరు సోడా అని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. బీజేపీ, టీఆర్ఎస్ తోడుదొంగల్లా తయారయ్యారని వ్యాఖ్యానించారు. ధాన్యం కొనుగోలు చేయకపోతే కేసీఆర్ గద్దె దిగాల్సిందేనని స్పష్టం చేశారు. రైతుల కోసం ఈ రాత్రి ధర్నా చౌక్ లోనే నిద్రిస్తామని చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా కాంగ్రెస్ పార్టీ వరి దీక్ష చేపట్టడం తెలిసిందే.

Related posts

టీడీపీ నేత‌ల ప‌రుష ప‌దజాలంపై రాష్ట్ర‌ప‌తికి వైసీపీ ఎంపీల బృందం ఫిర్యాదు

Drukpadam

టీడీపీలో ప్రక్షాళన జరగాలి…. సంచలన వ్యాఖ్యలు చేసిన ఎంపీ కేశినేని నాని!

Drukpadam

ఆఫ్ఘన్ పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నతస్థాయి సమావేశం!

Drukpadam

Leave a Comment