వాస్తవాలు చెప్పకుంటే ముక్కు నెలకు రాసి మూలాన కూర్చోండి -కోదండరాం హెచ్చరిక
-ఉద్యోగాల ఖాళీల విషయంలో అబద్దాల లెక్కలు మానండి
-నీళ్లు,నిధులు ,నియామకాల కోసమే తెలంగాణ ఉద్యమం జరిగింది
-అనేక మంది ఆత్మ బలిదానాల ఫలితమే తెలంగాణ
-ఉన్నత చదువులు చదివిన నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు
-వాస్తంగా భర్తీ చేసింది 77 వేలు మాత్రమే
-పీఆర్సీ నివేదిక ప్రకారమే లక్ష 91 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
ఉద్యోగాల ఖాళీల విషయంలో అబద్దాల లెక్కలు మానండి …. రాష్ట్రంలోని నిరుద్యోగ యువత వెయిట్ చేస్తున్నారు….. తక్షణం స్పందించండి…. లేకపోతే ముక్కు నెలకు రాసి, మూలకు కూర్చోండి. ఓట్లు అడగకండి అని తెలంగాణ జనసమితి అధ్యక్షులు , ఖమ్మం, నల్లగొండ, వరంగల్ పట్టభద్రుల నియోగజవర్గం నుంచి పోటీచేస్తున్న ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. రాష్ట్రమంత్రి టీఆర్ యస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించిన ఉద్యోగాల లెక్కలపై ఆయన ఘాటుగా స్పందించారు. తప్పుడు లెక్కల ద్వారా నిరుద్యోగులను మోసం చేయవద్దని హితవుపలికారు . నీళ్లు,నిధులు ,నియామకాల కోసమే తెలంగాణ ఉద్యమం నడిచిందని పేర్కొన్నారు. అనేక మంది ఆత్మ బలిదానాల ఫలితమే తెలంగాణ ఏర్పడిన విషయాన్నీ గుర్తుంచుకోవాలని అన్నారు. ఏ ఆశయం కోసం నిరుద్యోగులు పోరాటం చేశారో అది నెరవేర లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నత చదువులు చదివిన నిరుద్యోగులకు ఉద్యోగాలు లేని విషయాన్నీ పాలకులు విస్మరించటం బాధాకరమని అన్నారు. తెలంగాణ ఏర్పడిన తరువాత వాస్తంగా భర్తీ చేసిన ఉద్యోగాలు కేవలం 77 వేలు మాత్రమే కాగా లక్ష 30 వేల ఉద్యోగాలు భర్తీ చేసినట్లు ప్రకటించటం అశ్యస్పదంగా ఉందని అన్నారు. పీఆర్సీ నివేదిక ప్రకారమే లక్ష 91 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్న విషయాన్నీ ఆయన గుర్తు చేశారు.
2015లో ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటన చేసిన్రు – ఒక లక్షా 7 వేల పోస్టులు ఖాళీలు ఉన్నాయని, ఒక సంవత్సరంలో భర్తీ చేస్తామని అన్నారు. ఈ ఆరున్నర సంవత్సరాలలో కేవలం 77 వేల పోస్టులు భర్తీ అయినాయి. ఇంకా 30 వేల ఖాళీలు ఉన్నాయి. మొన్న పీఆర్.సి నివేదిక ప్రకారం రాష్ట్రంలో ఒక లక్ష 91 వేల ఖాళీలు ఉన్నాయి. వాస్తవం ఇట్లా ఉంటే కేటీఆర్ 1,32,799 లక్షకు పైగా ఉద్యోగాలు ఇచ్చినామని అబద్ధాలు చెప్పడం మేము తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన అన్నారు . ఈ మాటలు నమ్మవద్దని పట్టభద్రులకు, నిరుద్యోగ యువతకు కోదండరాం విజ్ఞప్తి చేశారు. భర్తీ అయిన రెగ్యులరైజేషన్, ప్రమోషన్లు, పబ్లిక్ రంగ సంస్థల ఉద్యోగాలు 2015లో సీఎం చెప్పిన ఒక లక్షా 7 వేల పరిధిలోకి రావు. ఈ ఆరున్నర సంవత్సరాలలో మొత్తంగా రాష్ట్రంలో భర్తీ చేసినవి 77 వేల ఉద్యోగాలు. పీ.ఆర్.సి. నివేదిక ప్రకారం ఖాళీగా ఉన్న ఒక లక్షా 91 వేల ఉద్యోగాలు ఎపుడు భర్తీ చేస్తారో చెప్పండి. జాబ్ క్యాలెండర్ విడుదల చేయండి. బకాయిలతో కలిపివేల రూపాయల నిరుద్యోగ భ్రుతి చెల్లించండి. ఆ తర్వాత ఓట్లు అడగండి. బహిరంగ చర్చకు సిద్ధం అన్నారు కేటీఆర్. మేము సిద్ధం. చిక్కడపల్లి లైబ్రరీ దగ్గరకు ఒస్తారా, అమరవీరుల స్థూపం దగ్గరకు ఒస్తారా, ఓయూ, కేయూ, శాతవాహన, మహాత్మాగాంధీ యూనివర్సిటీ… ఎక్కడికి ఒస్తారు? సమయం మీరు చెప్తారా? మమ్మల్ని చెప్పమంటారా? మీరు ఒస్తారా, కేసీఆర్ ఒస్తారా? తేల్చుకుని చెప్పండి అని కోదండరాం సవాల్ విసిరారు . ఈ రాష్ట్రంలోని నిరుద్యోగ యువత వెయిట్ చేస్తున్నారు. తక్షణం స్పందించండి. లేకపోతే ముక్కు నెలకు రాసి, మూలకు కూర్చోండి. ఓట్లు అడగకండి.
previous post
next post