Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

బీజేపీలో చేరిన తీన్మార్ మల్లన్న.. కేసీఆర్ ను అమరవీరుల స్తూపానికి కట్టేస్తానని వ్యాఖ్య!

బీజేపీలో చేరిన తీన్మార్ మల్లన్న.. కేసీఆర్ ను అమరవీరుల స్తూపానికి కట్టేస్తానని వ్యాఖ్య!
-ఢిల్లీలో తరుణ్ ఛుగ్ సమక్షంలో బీజేపీలో చేరిన తీన్మార్ మల్లన్న
-కార్యక్రమానికి హాజరైన బండి సంజయ్, ధర్మపురి అరవింద్
-తెలంగాణలో అత్యంత మోసకారి కేసీఆర్ అన్న మల్లన్న

తెలంగాణ నుంచి బీజేపీలో చేరే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. నిన్నమాజీ ఉద్యోగాల సంఘ నేత విఠల్ చేరగా నేడు సామాజిక ఉద్యమకారుడు తీన్మార్ మల్లన్న బీజేపీ తీర్థం పుచుకున్నారు. 2023 లో తెలంగాణాలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీ టీఆర్ యస్ మీద వ్యతిరేకత ఉన్న వాళ్ళందరిని బీజేపీ లో చేర్చుకుంటున్నది .ప్రధానంగా ఉద్యమకారులు చాలామంది బీజేపీ లో చేరుతున్నారు. ఇప్పటికే తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవరించిన శాశనమండలి మాజీ చైర్మెన్ స్వామి గౌడ్ బీజేపీ లో చేరారు . విజయశాంతి చేరిపోయారు. టీఆర్ యస్ కు చెందిన అనేక మాజీమంత్రి ఈటల రాజేందర్ బీజేపీ లో చేరి ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేసి తిరిగి బీజేపీ టికెట్ పై పోటీ చేసి గెలుపొందిన విషయం విదితమే . ఆ వరుసలోనే తీన్మార్ మల్లన్న అలియాన్ చింతపండు నవీన్ బీజేపీలో చేరారు. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జి తరుణ్ చుగ్ సమక్షంలో ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్నకు తరుణ్ ఛుగ్ కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనకు పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని అందజేశారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ ధర్మపురి అరవింద్ హాజరయ్యారు.

అనంతరం మీడియాతో తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ… చింతపండు నవీన్ ను ప్రజలు తీన్మార్ మల్లన్న చేశారని చెప్పారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు, కవితలను అమరవీరుల స్తూపానికి కట్టేస్తానని అన్నారు. తెలంగాణలో అత్యంత మోసకారి కేసీఆర్ అని మండిపడ్డారు. తనపై 38 కేసులు పెట్టి కేసీఆర్ సాధించిందేంటని ప్రశ్నించారు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చడమే తన ధ్యేయమని చెప్పారు. బీజేపీ గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతానని తెలిపారు.

Related posts

ఏపీ సినిమా టికెట్స్ ధరల విషయంలో కొత్త వివాదం…

Drukpadam

కేసీఆర్ సర్కార్ కో నిఖాలో…తెలంగాణ కో బచావో తుక్కుగూడ సభలో అమిత్ షా పిలుపు !

Drukpadam

స్పీడ్ పెంచిన భట్టి … రైతు భరోసా యాత్రలతో హల్చల్

Drukpadam

Leave a Comment