Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

చంద్రబాబు తో గ్యాప్ వచ్చినమాట నిజం … గంటా

చంద్రబాబు తో గ్యాప్ వచ్చినమాట నిజం … గంటా
పార్టీ మారడం లేదు …నాయకుల్లో మేటి చంద్రబాబే
-విశాఖ ఎమ్మెల్యే సీటు విషయంలో భిన్న అభిప్రయాలు
-2019 ఎన్నికల తరువాత ఆయన్ను కలవలేదు
-నేను వైసీపీ లోకి వస్తున్నట్లు 100 సార్లు ప్రచారం జరిగింది
-చివరికి తనకొడుకు వెళుతున్నారని ప్రచారం చేశారు
-స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసమే ఎమ్మెల్యే పదవికి రాజీనామా
-తన స్థానంలో పరిరక్షణ సమితి ఎవరిని నిలబెట్టిన మద్దతు ఇస్తా
గంటా శ్రీనివాసరావు విశాఖ జిల్లాకు చెందిన ప్రముఖ నేత ,ప్రస్తుతం తెలుగు దేశం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఆయన పార్టీ మారుతున్నారంటూ గత సంవత్సరకాలంగా వార్తలు పుంఖానుపుఖాలుగా వస్తున్నాయి . ఆయన చెప్పినట్లు 100 సార్లు కాకపోయినా కనీసం అందులో సగం సార్లు అన్నా ఆయన పార్టీ మారుతున్నట్లు వార్తలు వచ్చాయి. ఆయన ఒక టీవీ ఇంటర్ వ్యూ లో తాను పార్టీ మారడం లేదని స్పష్టం చేశారు. తనకు చంద్రబాబు నాయిడు తో గ్యాప్ వచ్చిన మాట నిజమేన్నారు. అయితే అదికూడా విశాఖ ఎంపీ సీటుకు తనను పోటీ చేయమన్నారని , విశాఖ ఎమ్మెల్యేగా లోకేష్ వస్తారని చెప్పారని అక్కడ తమకు తేడా వచ్చిందన్నారు. తరువాత తాను ఎమ్మెల్యేగానే పోటీ చేశానని ,అనంతరం ఆయన్ను తాను కలవలేదని తెలిపారు . తనకు తెలిసిన నాయకుల్లో చంద్రబాబే మేటి,బెస్ట్ అని ఆయనపై ప్రసంశలు కురిపించారు . తాను ఎప్పుడు పార్టీ మారలేదని ఒక్క సారి 2009 చిరంజీవి ప్రజారాజ్యం స్థాపించినప్పుడు మరీనా తిరిగి టీడీపీ లో చేరిన విషయాన్నీ ఆయన గుర్తు చేశారు. తాను వైసీపీ లో చేరుతున్నట్లు విజయసాయిరెడ్డి ప్రకటించడంపై ఆయన్నే అడగండి నేను ఎప్పుడు ఆయనకు చెప్పెనో అని అన్నారు. తన కుమారుడు చేరుతున్నట్లుగా వార్తలు వచ్చాయని 100 సార్లు తాను పార్టీ మారుతున్నట్లు మీడియా లో ప్రచారం జరిగిందన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసమే తాను రాజీనామా చేశానని దానికి కట్టుబడి ఉంటానని అన్నారు. అందరం కలిసి పోరాడితే స్టీల్ ప్లాంట్ ను ప్రవేటీకరణ గండం నుంచి తప్పించవచ్చునని అన్నారు. తాను రాజీనామా చేసిన దగ్గర విశాఖ స్టీల్ పరిరక్షణ సమితి నుంచి ఎవరిని పోటీ పెట్టిన మద్దతు ఇచ్చి గెలిపిస్తానని అన్నారు. తన అనుచరుడు కాశీ విశ్వనాధ్ వైసీపీ లో చేరిన విషయాన్నీ ప్రస్తావిస్తూ నాకు ఒక్క కాశీ విశ్వనాధ్ మాత్రమే అనుచురు కాదని చాలామంది అనుచరులు ఉన్నారని అన్నారు. పార్టీ మరి విషయం పై ఆయన స్పందిస్తూ తాను తెలుగుదేశం పార్టీలోనే ఉన్నానని దానికోసం పని చేస్తానని అన్నారు. అధినేతతో ఉన్న చిన్న చిన్న మనస్పర్థలు తొలగించుకొని కలిసి ముందుకు పోతానని అన్నారు. విశాఖ కార్పొరేషన్ ఎన్నికలలో కూడా అభ్యర్థుల ఎంపిక చేసిన విషయాన్నీ ఆయన గుర్తు చేశారు.
గంటా మాటలను బట్టి ఆయనకు చంద్రబాబుకు మధ్య గ్యాప్ ఉన్నప్పటికీ పార్టీ మారే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. దీనిపై ఆయన నిలబడతారో లేదో చూడాల్సిందే మరి !!!

 

Related posts

ఎమ్మెల్యే వంశీపై సీనియర్ నేత దుట్టా ఫైర్!

Drukpadam

ఎన్డీఏ ఉప‌రాష్ట్రప‌తి అభ్య‌ర్థి రేసులో న‌ఖ్వీ? కేంద్రమంత్రి పదవికి రాజీనామా!

Drukpadam

అంబటి రాయుడిపై అమరావతి రైతుల ఆగ్రహం

Ram Narayana

Leave a Comment