జనరల్ వార్తలు ...

ఇజ్రాయెల్ లో కొత్త వైరస్ కలకలం.. తొలి ‘ఫ్లోరోనా’ కేసు నమోదు!

ఇజ్రాయెల్ లో కొత్త వైరస్ కలకలం.. తొలి ‘ఫ్లోరోనా’ కేసు నమోదు!

  • కరోనా+ఫ్లూ వైరస్ లు కలిపి డబుల్ ఇన్ ఫెక్షన్
  • ప్రసవం కోసం ఆసుపత్రిలో చేరిన మహిళలో గుర్తింపు
  • మరికొందరిలోనూ ‘ఫ్లోరోనా’ ఉండి ఉంటుందన్న అధికారులు

ఇజ్రాయెల్ లో కొత్త వైరస్ కలకలం రేపుతోంది. ఇప్పటికే కరోనాలో కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చి ప్రపంచాన్ని ఆందోళన పరుస్తున్న నేపథ్యంలో.. ఇజ్రాయెల్ ఈ కొత్త వైరస్ మరింత ఆందోళన రేకెత్తిస్తోంది. ‘ఫ్లోరోనా’ తొలి కేసు నమోదైంది. కరోనాతో పాటు ఫ్లూ కూడా సోకే డబుల్ ఇన్ ఫెక్షన్ నే ఫ్లోరోనా అని పిలుస్తున్నారు. ప్రసవం కోసం రాబిన్ మెడికల్ సెంటర్ లో చేరిన మహిళకు ఈ డబుల్ ఇన్ ఫెక్షన్ సోకినట్టు అధికారులు చెప్పారు.

ప్రస్తుతం ఈ కేసుపై అధికారులు విశ్లేషణ చేస్తున్నారు. ఈ రెండు వైరస్ లు కలిస్తే జబ్బు తీవ్రత పెరుగుతుందా? అన్న దానిపై విశ్లేషిస్తున్నారు. మరికొందరు పేషెంట్లలోనూ ‘ఫ్లోరోనా’ మూలాలు ఉండి ఉంటాయని చెబుతున్నారు. కాగా, ఇప్పటికే శుక్రవారం నుంచి ఆ దేశ ప్రభుత్వం నాలుగో డోసు కరోనా వ్యాక్సిన్ ను రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్నవారికి, కరోనా ముప్పు ఎక్కువగా ఉన్న వారికి వేస్తోంది. తద్వారా నాలుగో డోసు వేస్తున్న తొలి దేశంగా ఇజ్రాయెల్ నిలిచింది.

Related posts

ఎన్ని ఏఐలు వచ్చినా… మనుషులతో సమానం కాదు: నందన్ నీలేకని

Ram Narayana

As tech companies get richer, is it ‘game over’ for startups?

Ram Narayana

A new boxing gym in Monroeville gives women the opportunity to train

Ram Narayana