అత్యాచారం చేసిన కేసులో 20 సంవత్సరాల జైలు శిక్ష
-మరో 25 వేల జరిమాన
-సంచలనంగా మారిన తీర్పు
మైనర్ బాలికను అత్యాచారం చేసిన కేసులో నిందితుడు అయినా కల్లూరు మండలం , చిన్నకోరుకొండి గ్రామానికి చెందిన మాడుగుల కృష్ణ కు 20 సంవత్సరాల జైలు శిక్ష తో పాటు రూ 25000/-ల జరిమానా విధిస్తూ ఖమ్మం మొదటి ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ సెషన్స్ కోర్టు ( ఫోస్కో 1) న్యాయమూర్తి మహ్మద్ అఫ్రోజ్ అక్తర్ గురువారం తీర్పు చెప్పారు. పిర్యాది కధనం ప్రకారం కల్లూరు మండలం , చిన్నకోరుకొండి గ్రామం నకు చెందినది . తనకు ఇద్దరు మనుమరాళ్లు ఉన్నారు . వారిలో చిన్న మనుమరాలు తన దగ్గర చదువు కుంటుంది. ది 20-5-2018 న తన ఇంటి ప్రక్కన ఉన్న నిందితుడు ఇంటికి టి.వి చూడటానికి పోగా నిందితుడు ఇంట్లో ఎవరులేని సమయం చూసి నిందితుడు మైనర్ బాలికను అత్యాచారం చేశాడని కల్లూరు పోలీసు స్టేషన్ లో పిర్యాదు చేశారు పోలీసులు కేసు నమోదు చేసి కోర్టు లో చార్జీషీట్ ధాఖలు చేయగా అట్టి కేసును విచారించిన న్యాయమూర్తి పై విధంగా తీర్పు చెప్పారు.ప్రాసిక్యూషన్ తరుపున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ టి.హైమావతి వాదించగా ,లైజన్ ఆఫీసర్ కె.మొహాన్ రావు , కోర్టు కానిస్టేబుల్ ఎం. నరిసింహరావు , హోంగార్డు చిట్టి బాబు లు సహకరించారు.