Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సంక్షేమానికి చిరునామా:మంత్రి హరీశ్‌ రావు!

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సంక్షేమానికి చిరునామా:మంత్రి హరీశ్‌ రావు!
-కల్యాణ లక్ష్మి పథకం కింద 10 లక్షల మందికి ఆర్థిక సహాయం
-కేసీఆర్ కిట్ తో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగింది.
-సింగిల్‌ ఫిల్టర్‌ను ఉపయోగించి ఉచితంగా డయాలసిస్‌

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సంక్షేమానికి చిరునామా అని మంత్రి హరీశ్‌ రావు అన్నారు. వైద్య ఆరోగ్యంపై సీఎం కేసీఆర్‌ ప్రత్యేక శ్రద్ధ పెట్టారని చెప్పారు. కేసీఆర్‌ కిట్‌ తర్వాత ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు 52 శాతానికి పెరిగాయన్నారు. ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లిలో వంద పడకల దవాఖాన నిర్మాణానికి మంత్రులు హరీశ్‌ రావు, పువ్వాడ అజయ్‌ కుమార్‌ శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి హరీశ్‌ రావు మాట్లాడుతూ.. ప్రతి జిల్లా కేంద్రానికి డయాలసిస్‌ కేంద్రం, ఐసీయూ వార్డులు తీసుకొచ్చిన ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిదని చెప్పారు.

సింగిల్‌ ఫిల్టర్‌ను ఉపయోగించి డయాలసిస్‌ ఉచితంగా చేస్తున్న రాష్ట్రం తెలంగాణ అని స్పష్టం చేశారు. కల్యాణ లక్ష్మి పథకం కింద 10 లక్షల మందికి ఆర్థిక సహాయం అందించామని పేర్కొన్నారు. తలసేమియా వ్యాధిగ్రస్తుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. అర్హులందరికి బూస్టర్‌ డోసు ఇస్తున్నామని చెప్పారు. సత్తుపల్లిలో 100 శాతం కరోనా వ్యాక్సిన్‌ రెండు డోసులు పూర్తయ్యాయని చెప్పారు.

ఆధునిక వైద్య సేవలు ఇకనుంచి హైద్రాబాద్ రాకుండా ఖమ్మం లోనే అందుబాటులోకి వచ్చే విధంగా చర్యలు చేపట్టినట్లు తెలిపారు . మధిర ,సత్తుపల్లి ,లలో 100 పడకల ఆసుపత్రులకు శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందని అన్నారు. ఖాళీ పోస్టుల భర్తీ తోపాటు అదనపు పోస్టుల మంజరికి చర్యలు తీసుకుంటామని తెలిపారు .

ఎమ్మెల్యే వెంకట వీరయ్య కోరగానే వంద పడకల దవాఖానను సీఎం కేసీఆర్‌ మంజూరు చేశారన్నారు. సత్తుపల్లిలో రూ.34 కోట్లతో 100 పడకల హాస్పిటల్‌ నిర్మిస్తున్నామని, రూ.1.25 లక్షలతో టీ డయాగ్నొస్టిక్‌ సెంటర్‌, రూ.1.78 కోట్లతో రేడియాలజీ ల్యాబ్‌ మంజూరు చేస్తున్నామని ప్రకటించారు. పెనుబల్లి, కల్లూరు ప్రభుత్వ దవాఖానల నిర్మాణానికి సహకరిస్తామన్నారు. మధిరలో నిన్న వంద పడకల హాస్పిటల్‌కు శంకుస్థాపన చేశామని తెలిపారు.

Related posts

మావోయిస్టు అగ్రనేత ఆర్కే భార్య శిరీషను అదుపులోకి తీసుకున్న పోలీసులు!

Drukpadam

ఐటీ దాడులు.. కీం కర్తవ్యం మంత్రులు ,ఎమ్మెల్యేల సమాలోచనలు …

Drukpadam

రాష్ట్రానికి ద్రోహం చేస్తున్న మోదీకి జగన్ మద్దతు ఇస్తున్నారు: శైలజానాథ్

Drukpadam

Leave a Comment