Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

రాష్ట్రపతి ప్రసంగంలోని హైలైట్స్…

పద్మాలను సామాన్యుల వరకు తీసుకెళ్లాం.. పార్లమెంటు సెంట్రల్ హాల్ లో రాష్ట్రపతి ప్రసంగం.. హైలైట్స్-1!

  • కరోనాపై పోరాటంలో భారత్ స్ఫూర్తి అద్భుతం
  • వ్యాక్సినేషన్ లో యావత్ ప్రపంచానికే భారత్ ఆదర్శం
  • ఎవరూ ఆకలితో ఉండకూడదనేదే నా ప్రభుత్వ లక్ష్యం
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పార్లమెంటుకు విచ్చేసిన భారత రాష్ట్రపతికి ప్రధాని మోదీ, ఉభయసభల అధ్యక్షులు, కేంద్ర మంత్రులు, ఎంపీలు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పార్లమెంటు సెంట్రల్ హాల్లో ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించారు. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు అయిన సందర్భంగా తొలుత ఆయన స్వాతంత్ర్య సమరయోధులకు నివాళి అర్పించారు. దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

 ఈ సందర్భంగా పార్లమెంటు సెంట్రల్ హాల్లో ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించారు. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు అయిన సందర్భంగా తొలుత ఆయన స్వాతంత్ర్య సమరయోధులకు నివాళి అర్పించారు. దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

రాష్ట్రపతి ప్రసంగంలోని హైలైట్స్ ఇవే:

  • కరోనాపై పోరాటంలో భారత్ స్ఫూర్తి అత్యద్భుతం.
  • వ్యాక్సినేషన్ వల్ల కరోనాను కట్టడి చేస్తున్నాం. కేంద్రం, అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు కలసికట్టుగా మహమ్మారిపై పోరాడుతున్నాయి.
  • వ్యాక్సినేషన్ లో యావత్ ప్రపంచానికే భారత్ ఆదర్శం.
  • ఇప్పుడు 15 నుంచి 18 సంవత్సరాల పిల్లలకు కూడా వ్యాక్సిన్ వేస్తున్నాం.
  • వ్యాక్సినేషన్ కార్యక్రమం శర వేగంగా సాగుతోంది. ఏడాది కాలంలో 15 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులు వేశాం.
  • భారత్ లోనే మూడు వ్యాక్సిన్లు తయారవుతున్నాయి. వ్యాక్సిన్ల ఉత్పత్తిలో భారత్ రెండో స్థానంలో ఉంది.
  • ఇప్పటి వరకు 8 వ్యాక్సిన్లకు అత్యవసర వినియోగ అనుమతి ఉంది.
  • ఫార్మా రంగాన్ని విస్తరించేందుకు భారత ప్రభుత్వం కృషి చేస్తోంది.
  • కరోనా కట్టడిలో ఫ్రంట్ లైన్ వారియర్లకు హ్యాట్సాఫ్.
  • సబ్ కా సాథ్, సబ్ కా వికాస్ లక్ష్యంతో నా ప్రభుత్వం పని చేస్తోంది.
  • ప్రధానమంత్రి ఆవాస్ యోజన కార్యక్రమంతో గృహ నిర్మాణాలు ఊపందుకున్నాయి.
  • దేశంలో 80 శాతం మంది చిన్న, సన్నకారు రైతులే.
  • రైతులకు అధిక మద్దతు ధర ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
  • జల్ జీవన్ మిషన్ తో గ్రామాలకు తాగునీరు అందుతోంది.
  • పద్మ పురస్కారాలను సామాన్యుల వరకు తీసుకెళ్లాం.
  • గ్రామీణ మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు రుణాలను పెంచుతున్నాం.
  • ప్రపంచంలో అతిపెద్ద ఆహార ఉత్పత్తి, సరఫరా వ్యవస్థ భారతే.
  • దేశంలో ఏ పేదవాడు ఆకలితో ఉండకూడదనేదే నా ప్రభుత్వ లక్ష్యం.
  • 8 వేలకు పైగా జన్ ఔషధి కేంద్రాల ద్వారా తక్కువ ధరకే ఔషధాలను తయారు చేస్తున్నాం.
  • ఈ-శ్రమ పోర్టల్ ద్వారా 23 కోట్ల మంది కార్మికులు కనెక్ట్ అయి ఉన్నారు.

 

శ్రీనగర్ నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి… పార్లమెంటులో రాష్ట్రపతి ప్రసంగం.. హైలైట్స్-2!

President Ram Nath Kovind speech in parliament

దేశ వ్యాప్తంగా 2 కోట్ల మంది పేదలకు పక్కా గృహాలను నిర్మించాం.

  • దేశంలోని 6 కోట్ల నివాసాలకు తాగునీటి కనెక్షన్లు ఇచ్చాం.
  • వ్యవసాయ రంగంలో ఎన్నో మార్పులను తీసుకొచ్చాం.
  • 1,900 కిసాన్ రైళ్లు 6 లక్షల టన్నుల ఆహార ధాన్యాలను తరలించాయి.
  • నదుల అనుసంధానం దిశగా నా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
  • మహిళా సాధికారతకు ఎంతో ప్రాధాన్యతను ఇస్తున్నాం.
  • బేటీ బచావో, బేటీ పఢావో కార్యక్రమం సత్ఫలితాలను ఇస్తోంది. స్కూళ్లకు వెళ్తున్న అమ్మాయిల సంఖ్య పెరిగింది.
  • ఇండియాలో ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్ తక్కువ ధరకే లభిస్తున్నాయి.
  • కొన్ని నెలలుగా జీఎస్టీ వసూళ్లు ప్రతి నెలా రూ. 1 లక్ష కోట్లకు పైగానే ఉన్నాయి.
  • చిన్న, మధ్య తరగతి పరిశ్రమలకు రూ. 3 లక్షల కోట్ల కొల్లేటరల్ ఫ్రీ లోన్లను ఇచ్చాం.
  • ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక శక్తుల జాబితాలో భారత్ మరోసారి నిలిచింది.
  • టోక్యో ఒలింపిక్స్ లో భారత యువత సత్తా చాటడం చూశాం.
  • దేశంలో 36,500 కిలోమీటర్ల రహదారులను నిర్మించాం.
  • డ్రోన్ టెక్నాలజీలో దూసుకుపోతున్నాం.
  • దేశ భద్రతకు నా ప్రభుత్వం కట్టుబడి ఉంది.
  • మేకిన్ ఇండియాలో భాగంగా రక్షణ రంగానికి ప్రాధాన్యతను ఇస్తున్నాం.
  • ఎన్నో సమస్యలు ఎదురైనా కాబూల్ నుంచి భారతీయులను, ఆఫ్ఘనిస్థాన్ ప్రజలను తీసుకొచ్చాం.
  • యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో దుర్గా పూజకు స్థానం కల్పించేలా చేశాం.
  • 2070 కల్లా జీరో కార్బన్ ఎమిషన్ ను టార్గెట్ గా పెట్టుకున్నాం.
  • జమ్మూలో ఐఐటీ, ఐఐఎం నిర్మిస్తున్నాం.
  • శ్రీనగర్-షార్జా అంతర్జాతీయ విమాన రాకపోకలు ప్రారంభమయ్యాయి.
  • ఒకప్పుడు దేశవ్యాప్తంగా 126 నక్సల్స్ ప్రభావిత జిల్లాలు ఉండగా… ఇప్పుడు వాటి సంఖ్య 70కి తగ్గింది.
  • ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి నా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ రాష్ట్రాల్లో రోడ్డు, రైల్ కనెక్టివిటీని పెంచాం. అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఈటానగర్ లో ఇప్పుడు అత్యాధునిక ఎయిర్ పోర్టు ఉంది.

Related posts

తీవ్ర ఉత్కంఠత రేపుతున్న ఖమ్మం ,నల్లగొండ ,వరంగల్ పట్టభద్రుల కౌంటింగ్

Drukpadam

ఛత్తీస్ ఘడ్ లో ఇంటివద్దనే ఓపెన్ బుక్ పరిక్ష విధానం …

Drukpadam

టీటీడీ నుంచి కీలక అప్‌డేట్… శ్రీవాణి ఆఫ్‌లైన్ టిక్కెట్లు రోజుకు 1000…

Ram Narayana

Leave a Comment