Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

అస్సాం సీఎంపై ఎర్రుపాలెం పోలీస్ స్టేషన్లో వెళ్లి ఫిర్యాదు చేసిన భట్టి!

అస్సాం సీఎంపై ఎర్రుపాలెం పోలీస్ స్టేషన్లో వెళ్లి ఫిర్యాదు చేసిన భట్టి!
-హిమంతను సమాజం నుంచి బహిష్కరించాలి
-అస్సాం సీఎం వ్యాఖ్యలు దేశ సంస్కృతిపై దాడి
-దేశానికి అందిస్తున్న బిజెపి భావజాలం ఇదేనా..?
-మోడీని నిలదీసిన సీల్పీ లీడర్ భట్టి విక్రమార్క

 

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ పై కేసు నమోదు చేయాలనీ ,సీఎల్పీ నేత భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు . ఈ మేరకు మధిర నియోజవర్గ పరిధిలోని ఎర్రుపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు .

దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఇందిరమ్మ మనుమడు  ఎంపి రాహుల్ గాంధీ పైన అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ చేసిన వ్యాక్యాలు
ప్రపంచ దేశాలు ఆరాధించే దేశ సంస్కృతి, గౌరవించే కుటుంబ వ్యవస్థను అవమానపరిచే విధంగా ఉన్నందున ఆ సీఎంను సమాజం నుంచే బహిష్కరించాలని సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క అన్నారు. దేశ సంస్కృతి, ఆచారాలు, కుటుంబ వ్యవస్థపై దాడి చేసే విధంగా నీచమైన వ్యాక్యాలు చేసిన హిమంతకు ముఖ్యమంత్రిగా కొనసాగే నైతికతలేదన్నారు. వెంటనే ప్రధాని మోడీ, బిజెపి అగ్రనాయకత్వం స్పందించి పదవి నుంచి బర్తరఫ్ చేయడంతో పాటు వారి పార్టీ నుంచి, ఈసమాజం నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. హిమంతపై చర్యలు తీసుకోకుంటే దేశానికి అందిస్తున్న బిజెపి బావాజాలం ఇదేనా..? అని ప్రజలు మీపార్టీని ఈసడించుకుంటారన్నారు. ఇటువంటి వ్యాక్యాలు చేయడమేనా..? బిజెపి నేర్పుతున్న సంస్కృతి అని ప్రశ్నించారు.

ఎర్రుపాలెం పోలీస్ స్టేషన్లో లో భట్టి ఫిర్యాదు

సభ్యసమాజం తలదించుకునే విధంగా కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ పైన అనుచిత వ్యాక్యాలు చేసిన అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మపై కేసు నమోదు చేయాలని సీల్పీ లీడర్ మల్లు భట్టి విక్రమార్క పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదివారం ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండల కాంగ్రెస్ కమిటి నాయకులతో కలిసి సీల్పీ లీడర్ భట్టి విక్రమార్క ఎర్రుపాలెం పోలీస్ స్టేషన్ వెళ్లి స్వయంగా ఫిర్యాదు చేశారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన భారతరత్న దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ కుమారుడు పార్లమెంట్ సభ్యుడు రాహుల్ గాంధీ పైన అస్సాం సీఎం హిమంత వ్యాక్యాలు సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న హిమంత బిశ్వ శర్మ చేసిన వ్యాక్యాలు భారతీయ సంస్కృతిని దెబ్బతీసే విధంగా ఉన్నాయన్నారు. రాజ్యంగం ప్రసాదించడం వల్ల ఉన్నత పదువుల్లో ఉన్న వారు సమాజానికి మేలు చేయాలే గానీ, ఇటువంటి నీచమైన వ్యాక్యాలు చేయడం తగదన్నారు. హిమంతశర్మ చేసిన వ్యాక్యాలు ఐపిసి సెక్షన్ ప్రకారం ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేయోచ్చో పోలీసులు పరిశీలించి ఆవిధంగా ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయాలని కోరారు. ఫిర్యాదు చేసిన కార్యక్రమంలో ఎర్రుపాలెం కాంగ్రెస్ మండల అధ్యక్షులు వేమిరెడ్డి సుధాకర్ కాంగ్రెస్ నాయకులు బండారు నర్సింహ్మరావు, తలపరెడ్డి నాగిరెడ్డి, ఎస్.కె ఇస్మాయిల్, కంచర్ల వెంకట్ కడియం శ్రీను, దేవరకొండ రాజీవ్ మారబత్తుల మోహన్ సూరంశెట్టి రాజేష్, యన్నం పిచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related posts

పొంగులేటి కాంగ్రెస్ లో చేరకుండా అడ్డుకట్టలు పడుతున్నాయా …?

Drukpadam

శరద్ పవార్ వెన్నుపోటుదారన్న శివసేన నేత గీతే.. జాతీయ నేతగా అభివర్ణించిన సంజయ్ రౌత్!

Drukpadam

ప్రాణం పోయేంత వరకు బీజేపీతో కలవను: నితీశ్ కుమార్

Drukpadam

Leave a Comment