Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
సినిమా వార్తలు

తెలుగు సినీ ఇండస్ట్రీలో పెద్దన్న వివాదం ….

తెలుగు సినీ ఇండస్ట్రీలో పెద్దన్న వివాదం ….
చిరంజీవి నే పెద్ద దిక్కు అన్న రాజమౌళి
అందుకు ఆయన ఒప్పుకోక పోయిన ఇది నిజమన్న రాజమౌళి
సినీ ఇండస్ట్రీకి పెద్దన్న మోహన్ బాబు అన్న నరేశ్
మోహన్ బాబు ఇండస్ట్రీకి పెద్ద దిక్కు
అందరి కంటే మిన్న మోహన్ బాబు
సినిమా కోసమే పుట్టిన వ్యక్తి మోహన్ బాబు

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎవరు అవునన్నా కాదన్నా రెండు వర్గాలుగా చీలిపోయి ఉంది. దానికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి ఇండస్ట్రీ కి ఎవరు పెద్దన్న అనేదానిపైన వివాదం ఉంది. ఇండస్ట్రీలో చిరంజీవి , మోహన్ బాబులు ఎప్పటినుంచో విభేదాలు ఉన్నాయి. కానీ కొంతకాలం క్రితం కలిశారు . తిరిగి ఫిలిం ఛాంబర్ కు జరిగిన ఎన్నికల్లో రెండుగా చీలిపోయారు . ఆ చీలిక ఇండ్రస్టీలో పెద్ద దుమారమే లేపుతుంది. చిరంజీవి ఇండస్ట్రీకి పెద్ద అని కొందరు . లేదు మోహన్ బాబు పెద్ద అని కొందరు వాదులాడుకుంటున్నారు . దీనికి తోడు ఏపీ ప్రభుత్వం తో సినీ ఇండస్ట్రీ కి సంబందించిన చర్చల్లో చిరంజీవి అండ్ టీం పాల్గొన్నది . చిరంజీవి తో పాటు మహేష్ బాబు , ప్రభాస్ లాంటి అగ్ర హీరోలు పాల్గొన్నారు . దీనిపై తమ్మ రెడ్డి భరద్వాజ్ ద్వజామెత్తారు . టీడీపీ అధినేత చంద్రబాబు కూడా అదే తరహా స్టేట్ మెంట్ ఇచ్చారు . చిరంజీవి రెండు సార్లు ఏపీ సీఎం జగన్ కలిసి చర్చలు జరిపి ఇండస్ట్రీ మేలు చేసే విధంగా ఒప్పించగలిగారు . ఇందుకు ఆయన పై విమర్శ లు వచ్చాయి. అయినప్పటికీ చిరంజీవి ఇండస్ట్రీకి మేలు జరిగితే చాలు అనుకున్నారు . సీఎం తో చర్చల అనంతరం జరిగిన మీడియా సమావేశంలో రాజమౌళి మాట్లాడుతూ చిరంజీవి అంగీకరించారు కానీ ఆయన తెలుగు సినిమా ఇండస్ట్రీకి పెద్ద దిక్కు అని అన్నారు .దానిపై సినీ నటుడు నరేష్ పెద్ద దిక్కు మోహన్ బాబు అని అందం చర్చనీయాంశం గా మారింది.

సినీ నటుడు నరేశ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. సినీ పరిశ్రమకు పెద్దదిక్కు ఎవరనే చర్చ జరుగుతున్న సమయంలో ఆయన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. మోహన్ బాబు సినిమా పరిశ్రమకు పెద్ద దిక్కు అని ఆయన అన్నారు. తెలుగు సినీ పరిశ్రమకు పెద్దన్న, తమ అందరికీ అన్న, అందరి కంటే మిన్న మోహన్ బాబు అని అన్నారు.

తెలుగు సినీ పరిశ్రమలో గొప్ప హీరోలున్నారని, గొప్ప విలన్లు ఉన్నారని, గొప్ప క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్నారని… కానీ అన్నీ కలిసిన ఒకే ఒక వ్యక్తి మోహన్ బాబు అని నరేశ్ కొనియాడారు. ఆయనకు ఆయనే సాటి అని అన్నారు. రైతు కుటుంబంలో జన్మించి, ఉపాధ్యాయుడిగా ఎదిగి, యూనివర్శిటీ స్థాపించే స్థాయికి చేరుకున్న ఏకైక నటుడు మోహన్ బాబు అని కితాబునిచ్చారు. మోహన్ బాబు సినిమా కోసం బతికే వ్యక్తి కాదని, సినిమా కోసం పుట్టిన వ్యక్తి అని అన్నారు.

Related posts

అల్లు అర్జున్ పై అమితాబ్ ప్రశంసల జల్లు.. నమ్మలేకపోతున్నానంటూ బన్నీ రిప్లై…

Ram Narayana

హైదరాబాద్‌లో పట్టపగలు దారుణం..

Drukpadam

“మా” కు ప్రకాష్ రాజ్ రాజీనామా ….వద్దు అంకుల్ అని వారించిన విష్ణు…

Drukpadam

Leave a Comment