Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

యూపీ, ఉత్తరాఖండ్, గోవాలో ముగిసిన పోలింగ్!

యూపీ, ఉత్తరాఖండ్, గోవాలో ముగిసిన పోలింగ్!

  • యూపీలో రెండో దశ పోలింగ్
  • 60.69 శాతం ఓటింగ్ నమోదు
  • గోవా, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు ఒకే విడతలో ఎన్నికలు
  • గోవాలో భారీ ఓటింగ్

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్ ముగిసింది. యూపీలో సాయంత్రం 6 గంటల సమయానికి 60.69 శాతం ఓటింగ్ నమోదైంది. రెండో దశలో ఉత్తరప్రదేశ్ లో 55 స్థానాలకు పోలింగ్ నిర్వహించారు. ఇక్కడ మొత్తం 403 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, ఏడు దశల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు.

అటు, ఉత్తరాఖండ్, గోవా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నేడు ఒకే విడతలో పోలింగ్ చేపట్టారు. ఈ రెండు రాష్ట్రాల్లోనూ పోలింగ్ ముగిసింది. ఉత్తరాఖండ్ లో మొత్తం 70 సీట్ల కోసం ఇవాళ ఎన్నికలు జరిగాయి. సాయంత్రం 5 గంటల సమ 59.37 శాతం పోలింగ్ నమోదైంది.

గోవాలో భారీ ఎత్తున ఓటర్లు తరలివచ్చారు. సాయంత్రం 5 గంటల సమయానికి ఇక్కడ 75.29 శాతం పోలింగ్ నమోదైంది. గోవా అసెంబ్లీలో 40 స్థానాలు ఉండగా, అన్నింటికి ఇవాళ పోలింగ్ చేపట్టారు.

ఇంకా, యూపీలో 5 దశల పోలింగ్ మిగిలుంది. మణిపూర్, పంజాబ్ రాష్ట్రాలకు కూడా ఎన్నికలు పూర్తి కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాలకు కలిపి  మార్చి 10న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

Related posts

కాంగ్రెస్ లో చేరిన షర్మిల.. కండువా కప్పి ఆహ్వానించిన ఖర్గే, రాహుల్

Ram Narayana

సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులపై ఉపేక్షించేది లేదు: ఏపీ సీఐడీ!

Drukpadam

పాకిస్థాన్ లో హిందూ యువతి సనా ఘనత…

Drukpadam

Leave a Comment