అంతర్జాతీయం

భారీ మూల్యం తప్పదంటూ ఇజ్రాయెల్‌కు మోజ్తబా తీవ్ర హెచ్చరిక

ఇరాన్ సెక్యూరిటీ చీఫ్ అలీ లారీజానీని ఇజ్రాయెల్ హత్య చేయడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. దీనిపై ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోజ్తాబా ఖమేనీ స్పందిస్తూ.. ఇజ్రాయెల్‌కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఈ దుశ్చర్యకు ఇజ్రాయెల్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని అన్నారు.

లారీజానీని ‘అమరవీరుడు’గా అభివర్ణించిన ఖమేనీ.. ఆయన రక్తం వృథా కాదని అన్నారు. ‘‘మా నాయకులను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా ఇజ్రాయెల్ తన పతనానికి తానే పునాది వేసుకుంటోంది. ఇలాంటి హత్యలతో మా మనోస్థైర్యం దెబ్బతినదు, మా విప్లవ పోరాటం మరింత ఉద్ధృతమవుతుంది’’ అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 

బుధవారం టెహ్రాన్‌లో లారీజానీ, సులేమానిల అంత్యక్రియలు అశేష జనసందోహం మధ్య జరిగాయి. ఈ సందర్భంగా ఇజ్రాయెల్, అమెరికాకు వ్యతిరేకంగా నినాదాలతో టెహ్రాన్ వీధులు దద్దరిల్లాయి. ఒకవైపు అమెరికా ‘బంకర్ బస్టర్’ బాంబులతో దాడులు చేస్తుండగా, మరోవైపు ఇరాన్ అణు పరీక్షలకు సిద్ధమవుతోందన్న వార్తలు అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తున్నాయి.

Related posts

అల్లాయే సాక్ష్యం.. ఆ బిల్లులపై సంతకాలు చేయలేదు.. బాంబు పేల్చిన పాక్ అధ్యక్షుడు

Ram Narayana

విరిగిన ఎముకలను అతికించేందుకు ఫెవిక్విక్ లాంటి గమ్… చైనా పరిశోధకుల అద్భుత సృష్టి!

Ram Narayana

 కాంగో రాగి గనిలో ప్రమాదం.. 32 మంది కార్మికులను బలిగొన్న వంతెన…

Ram Narayana