Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

కాంగ్రెస్ ను వీడొద్దంటూ జగ్గారెడ్డి కాళ్లు పట్టుకుని బతిమాలిన పీసీసీ ప్రధాన కార్యదర్శి…

కాంగ్రెస్ ను వీడొద్దంటూ జగ్గారెడ్డి కాళ్లు పట్టుకుని బతిమాలిన పీసీసీ ప్రధాన కార్యదర్శి…
-కాంగ్రెస్ పార్టీని వీడాలనుకుంటున్న జగ్గారెడ్డి
-తెలంగాణ కాంగ్రెస్ లో కలకలం
-ఓ హోటల్ లో వీహెచ్ ను కలిసిన జగ్గారెడ్డి
-జగ్గారెడ్డిని బుజ్జగించే ప్రయత్నాలు

తెలంగాణ కాంగ్రెస్ లో జగ్గారెడ్డి రూపంలో మరో అసంతృప్తి గళం వినిపిస్తోంది. పార్టీ నుంచి ఆయన తప్పుకోవాలన్న నిర్ణయం రాష్ట్ర కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. కాగా, జగ్గారెడ్డిని బుజ్జగించేందుకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు రంగంలోకి దిగారు. వీహెచ్ ను జగ్గారెడ్డి ఓ హోటల్ లో కలిశారు.

అయితే, అక్కడే ఉన్న పీసీసీ ప్రధాన కార్యదర్శి బొల్లి కిషన్… జగ్గారెడ్డి కాళ్లు పట్టుకుని మరీ బతిమాలడం వీడియోలో కనిపించింది. రాజీనామా చేయబోనని ప్రకటిస్తేనే కాళ్లు వదులుతానని బొల్లి కిషన్ పేర్కొన్నారు. నువ్వు పైకి లెగు అంటూ జగ్గారెడ్డి… నువ్వు చెబుతానంటే నేను లేస్తా అంటూ బొల్లి కిషన్… వీడియోలో ఆసక్తికర దృశ్యాలు కనిపించాయి. ఇదంతా ఓ సోఫాలో కూర్చుని వీహెచ్ చూస్తూనే ఉన్నారు. ఆయన ఈ తతంగంపై తనదైన శైలిలో ఛలోక్తులు విసిరారు.

జగ్గారెడ్డి సమస్యపై రేవంత్ రెడ్డి స్పందన!

సీనియర్ నేత, ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యవహారం తెలంగాణ కాంగ్రెస్ లో హాట్ టాపిక్ గా మారింది. టీఆర్ఎస్ కోవర్ట్ నంటూ తన గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఆయన రాహుల్ గాంధీకి లేఖ రాశారు. ఈ లేఖలో రేవంత్ రెడ్డిని ఆయన టార్గెట్ చేశారు. అంతేకాదు మీడియాతో ఆయన మాట్లాడుతూ తాను కాంగ్రెస్ గుంపులో లేనని చెప్పారు. త్వరలోనే పార్టీకి రాజీనామా చేస్తానని అన్నారు. ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

జగ్గారెడ్డి అంశంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ఇది ఒక సమస్య అని అన్నారు. కుటుంబం అన్నాక ఎన్నో సమస్యలు ఉంటాయని, అన్ని సమస్యలను తామే పరిష్కరించుకుంటామని చెప్పారు. మీడియా ఈ అంశాన్ని పెద్దగా చూపాల్సిన అవసరం లేదని అన్నారు. టీ కప్పులో తుపాను మాదిరే ఈ సమస్య కూడా పరిష్కారమవుతుందని చెప్పారు. తమ పార్టీలో విభేదాలు లేవని, భేదాభిప్రాయాలు మాత్రమే ఉన్నాయని అన్నారు. గోతికాడ నక్కల మాదిరి టీఆర్ఎస్ నేతలు ఆడే ఆటలు సాగవని చెప్పారు.

Related posts

మిస్టర్ కేటీఆర్… నీ అధికారం, అక్రమ సంపాదన శాశ్వతం కాదని తెలుసుకో: కోమటిరెడ్డి…

Drukpadam

కేసీఆర్ తో భేటీపై ఉండవల్లి …

Drukpadam

ప్రధాని మోదీ ఇంట బీజేపీ కీలక నేతల భేటీ..అర్ధరాత్రి చర్చలు

Drukpadam

Leave a Comment