చంద్రబాబు చేతిలో పావుగా వివేకా కుమార్తె: సజ్జల ఆరోపణ!
ఆధారాలు లేకుండా సునీత ఆరోపణలు
వివేకా కేసులో వరుస ప్రకటనలపై సజ్జల మండిపాటు
దారుణ హత్యకు గురైన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీత, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి కలిసి టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు చేతిలో పావులుగా మారారని వైసీపీ నేత, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ఈ మేరకు కాసేపటి క్రితం తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన సందర్భంగా సజ్జల ఒకింత ఘాటు విమర్శలే చేశారు.
వివేకానందరెడ్డి కేసు దర్యాప్తులో చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని, మూడేళ్లుగా చంద్రబాబు అదే పని పెట్టుకున్నారని సజ్జల ఆరోపించారు. చంద్రబాబు కుట్రల్లో భాగంగానే ఆయన చేతిలో సునీతతో పాటు ఆమె భర్త కూడా పావులుగా మారిపోయారని ఆయన ఆరోపించారు. ఏమాత్రం ఆధారాలు లేకుండానే సునీత ఆరోపణలు చేస్తున్న వైనమే ఇందుకు నిదర్శనమని కూడా సజ్జల ఆరోపించారు.
ఇవాళ సునీత అన్నాడు… రేపు విజయమ్మ, షర్మిల కూడా చంద్రబాబు చేతిలో పావులే అంటాడు: సజ్జలపై అయ్యన్న ఫైర్
- సీఎం జగన్ పై వివేకా కుటుంబ సభ్యుల తీవ్ర ఆరోపణలు
- సీఎం జగన్ హస్తం ఉండొచ్చన్న వివేకా అల్లుడు
- సునీత చంద్రబాబు చేతిలో పావుగా మారారన్న సజ్జల
వైఎస్ వివేకా హత్య వెనుక సీఎం జగన్ ఉండొచ్చంటూ వివేకా అల్లుడు రాజశేఖర్ రెడ్డి సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొనడం తెలిసిందే. అయితే, వివేకా కుమార్తె సునీత టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చేతిలో పావుగా మారారని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
దీనిపై టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు స్పందించారు. ఇవాళ సునీత చంద్రబాబు చేతిలో పావు అన్నాడని, రేపు విజయమ్మ, షర్మిల కూడా చంద్రబాబు చేతిలో పావులేనని అంటాడని సజ్జలపై విమర్శనాస్త్రాలు సంధించారు. సజ్జల వంటి నీచుడి క్యారెక్టర్ పురాణాల్లో కూడా ఉండదని అయ్యన్న మండిపడ్డారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. సజ్జల కామెంట్ల తాలూకు వీడియోను కూడా పంచుకున్నారు.
అటు బుద్ధా వెంకన్న కూడా సజ్జలపై విరుచుకుపడ్డారు. “గతంలో నారాసుర చరిత్ర అని సిగ్గులేకుండా బురదజల్లారు. మరి మీ సాక్షి పత్రికకు ఉన్న సిగ్గు గురించి మాట్లాడడం మర్చిపోయావేం సజ్జలా?” అని ప్రశ్నించారు. “ఆ రోజు చంద్రబాబు చేయించారని చెప్పడానికి లేని సిగ్గు, ఇవాళ మీ ఇంటి ఆడబిడ్డ సునీత జగనాసుర రక్తచరిత్ర బయటపెడితే వచ్చిందా?” అంటూ మండిపడ్డారు.