రాజకీయ వార్తలు

చెన్నై మేయర్‌గా దళిత యువతి.. అతి పిన్న వయస్కురాలిగా గుర్తింపు!

చెన్నై మేయర్‌గా దళిత యువతి.. అతి పిన్న వయస్కురాలిగా గుర్తింపు!
350 ఏళ్ల చెన్నై కార్పొరేషన్ చరిత్రలో తొలి దళిత మేయర్‌గా ప్రియ
28 ఏళ్ల వయసులోనే మేయర్‌గా రికార్డు
తమిళనాడులోని మొత్తం 21 కార్పొరేషన్లలో 11 చోట్ల మహిళా మేయర్లే

గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ (జీవీసీ) మేయర్‌గా ఎన్నికైన దళిత మహిళ ప్రియ నిన్న ప్రమాణ స్వీకారం చేస్తూనే రికార్డులకెక్కారు. 350 ఏళ్ల చెన్నై కార్పొరేషన్ చరిత్రలో దళిత మహిళకు తొలిసారి మేయర్ పీఠం దక్కగా, 28 ఏళ్ల అతి పిన్న ప్రాయంలోనే ప్రియ ఆ బాధ్యతలు స్వీకరించి రికార్డులకెక్కారు.

ప్రియ భర్త రాజా ఓ ప్రైవేటు కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. రాష్ట్రంలోని మొత్తం 21 కార్పొరేషన్లలో 11 చోట్ల మహిళలే మేయర్లు కావడం మరో విశేషం. కాగా, మొత్తం 200 మంది కార్పొరేటర్లలో డీఎంకేకు చెందిన 153 మంది ఆది ద్రావిడ (ఎస్‌సీ) వర్గానికి చెందిన ప్రియను మేయర్‌గా ఎన్నుకున్నారు.

చెన్నై లో దళిత మహిళ మేయర్ గా ఎన్నికవడం చరిత్రకు ఎక్కిందని ప్రజలు చర్చించుకుంటున్నారు .అధికార డీఎంకే కి చెందిన ప్రియ ఎన్నిక మొత్తం ఎన్నికలకే హైలెట్ గా నిలిచిందని పరిశీలకుల అభిప్రాయం .

Related posts

మోత్కుపల్లి కషాయానికి గుడ్ బై … గులాబీ గూటికి సై….

Drukpadam

కాంగ్రెస్ లో కపిల్ సిబాల్, గులాం నబి ఆజాద్ కుంపటి …వారిపై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్న నేతలు!

Drukpadam

దళితబందు డబ్బు ఇస్తాం…బట్ కండిషన్స్ అప్లై…

Drukpadam