Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

పెట్రో రేట్ల దొంగ దెబ్బ ఐదు రాష్ట్రాల ఎన్నికలు పూర్తీ …లీటర్ కు రూ 15 పెంపు ?

పెట్రో రేట్ల దొంగ దెబ్బ ఐదు రాష్ట్రాల ఎన్నికలు పూర్తీ …లీటర్ కు రూ 15 పెంపు ?
-లీట‌ర్‌పై రూ.15 పెంపు?.. పెట్రో బాంబు భ‌గ్గుమంటుందా?
-95 నుంచి 125 డాల‌ర్ల‌కు క్రూడాయిల్ ధ‌ర‌లు
-దేశంలో ముగిసిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌లు
-ఒక‌టి, రెండు రోజుల్లోనే ధ‌ర‌ల వాత త‌ప్ప‌దా?

ఉక్రెయిన్‌పై ర‌ష్యా యుద్ధం మొద‌లైన త‌ర్వాత అంత‌ర్జాతీయంగా ముడి చ‌మురు ధ‌ర‌లు ఆకాశాన్నంటిన సంగ‌తి తెలిసిందే. యుద్ధానికి ముందు క్రూడాయిల్ బ్యారెల్ ధ‌ర 95 డాల‌ర్లుగా ఉంటే.. అదే ధ‌ర ప‌ది రోజులు తిర‌క్కుండానే ఏకంగా 125 డాల‌ర్ల‌కు పెరిగిపోయింది. ఫ‌లితంగా ఇంధ‌నం కోసం దిగుమ‌తుల‌పైనే ఆధార‌ప‌డే చాలా దేశాల్లో పెట్రోల్‌,డీజిల్ ధ‌ర‌లు చుక్క‌ల‌నంటుతున్నాయి.

అయితే మ‌న వ‌ద్ద 5 రాష్ట్రాల ఎన్నిక‌లు జ‌రుగుతున్న నేప‌థ్యంలో కేంద్రంలోని బీజేపీ స‌ర్కారు పెట్రో ధ‌ర‌ల వాత‌పై దృష్టి సారించ‌లేదు. అయితే సోమ‌వారం నాటితో 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌లు ముగిసిపోయాయి. అంటే.. పెట్రో బాంబు పేలేందుకు రంగం సిద్ధం అయిన‌ట్టేన‌న్న దిశ‌గా ఆస‌క్తిక‌ర విశ్లేష‌ణ‌లు మొద‌ల‌య్యాయి. ప్రజలపై పెట్రో రేట్ల దొంగ దెబ్బ కొట్టేందుకు కేంద్రం సిద్ధమైంది. ఐదు రాష్ట్రాల సందర్భంగా పెట్రోరెట్లు పెంచితే అధికేంద్రం మీద పడి బీజేపీ కి నష్టం జరుగుతుందనే ఉద్దేశంతో పెంచకుండా పక్కన పెట్టారు . ఇప్పుడు ఎన్నికలు అయిపోయినందున ఇక ప్రజల పై భారాలు వేయడానికి రేపో మాపో అనే అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి.

నిపుణులు అంచ‌నా వేస్తున్న‌ట్లుగా ఒక‌టి, రెండు రోజుల్లోనే పెట్రో ధ‌ర‌లు పెరగ‌డం ఖాయ‌మ‌నే తెలుస్తోంది. అంతేకాకుండా ఒక‌వేళ ధ‌ర‌లంటూ పెరిగితే.. లీట‌ర్ పెట్రోల్‌పై ఏకంగా ఒకేసారి రూ.15, లీట‌ర్ డీజిల్‌పై ఒకేసారి రూ.20 పెరిగే అవకాశం ఉంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇదే జ‌రిగితే.. నిత్యావ‌స‌రాల ధ‌ర‌లు కూడా ఆకాశాన్నంటే ముప్పు లేక‌పోలేదు. అయితే కేంద్రం కాస్తయినా క‌నిక‌రించి తాను విధించే ఎక్సైజ్ సుంకాన్ని కాస్తంత త‌గ్గిస్తే.. ప్ర‌జ‌ల‌పై కొంతైనా భారం త‌గ్గుతుంది క‌దా అన్న విశ్లేష‌ణ‌లు వినిపిస్తున్నాయి.

Related posts

రేవంత్ రెడ్డి, నేను సమానమే… చట్టం తన పని చేయకుంటే ఇక నా చట్టం ప్రారంభిస్తా..!: ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి హెచ్చరిక

Ram Narayana

రైల్వేకు తత్కాల్ టికెట్ల రూపంలో భారీ ఆదాయం!

Drukpadam

ఏపీ హై కోర్ట్ సింగల్ జడ్జి స్టేపై డివిజన్ బెంచ్ కి అప్పీల్

Drukpadam

Leave a Comment