Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఆత్మరక్షణలో ఎం ఐ ఎం …బీజేపీతో లాలూచి లేదని వెల్లడి!

ఆత్మరక్షణలో ఎం ఐ ఎం …బీజేపీతో లాలూచి లేదని వెల్లడి!
మేం బీజేపీకి బీ టీం కాదు.. కాంగ్రెస్ తో జట్టు కడతాంమని స్పష్టికరణ
ఎన్సీపీతోనూ స్నేహానికి రెడీ అన్న ఇంతియాజ్ జలీల్
వాళ్లకు ముస్లిం ఓట్లు కావాలి
అందుకు చేతులు కలిపేందుకు మేం సిద్ధం
బీజేపీని ఓడించడమే లక్ష్యమన్న మజ్లిస్ మహారాష్ట్ర చీఫ్

ఇంట బయట విమర్శల నేపథ్యంలో ఎంఐఎం ఆత్మరక్షణలో పడినట్లు ఉంది. తాము బీజేపీ ని ఓడించేందుకు కాంగ్రెస్ తో జట్టు కడతామని వెల్లడించింది. ఈ మేరకు మహారాష్ట్ర ఎంఐఎం చీఫ్ ఇంతియాజ్ ఒక ప్రకటన చేశారు . ఎంఐఎం బీజేపీ కి పరోక్షంగా ఉపయోగపడుతుందని అందువల్లనే బీహార్ లోను , యూపీ లోను మహారాష్ట్రలో ఫలితాల్లో తేడా వచ్చి ఎంఐఎం పోటీ బీజేపీ కి ఉపయోగ పడిందని ఆరోపణలు ఉన్నాయి. ఇది క్యాడర్ లో కూడా చర్చనీయాంశంగా మారింది. పార్టీ పెద్దలు బీజేపీ తో సంబంధాలు కలిగి ప్రతిపక్షాల ఓట్లను చీల్చి బీజేపీ కి సహాయం చేస్తుందని వస్తున్నా ఆరోపణలపై ఎంఐఎం వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. ప్రధానంగా యూపీ ఎన్నికల్లో సుమారు 80 పైగా సీట్లలో ఎంఐఎం కి 2 వేల నుంచి 7 వేల కు పైగానే ఓట్లు వచ్చాయి. దీంతో ఎస్పీ పై దీని ప్రభావం పడి ఓటమి పాలైంది. దీంతో ఎంఐఎం శ్రేణుల్లో కూడా పార్టీ నిర్ణయాన్ని తప్పు పడుతున్నారు. దీంతో అతామ్రక్షణలో పడిన పార్టీ తాము బీజేపీ కి వ్యతిరేకమని అందుకు కాంగ్రెస్ తో జత కలుస్తామని ప్రకటించడం గమనార్హం …

బీజేపీకి మజ్లిస్ పార్టీ బీ టీమ్ కానేకాదని ఎంఐఎం మహారాష్ట్ర చీఫ్, ఎంపీ ఇంతియాజ్ జలీల్ స్పష్టం చేశారు. అవసరమైతే కాంగ్రెస్ తో జట్టు కడతామని అన్నారు. మహారాష్ట్రలోని మహా వికాస్ అఘాడీలో ఎన్సీపీ, కాంగ్రెస్ తో పాటు శివసేన కూడా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఎన్సీపీ, కాంగ్రెస్ తో జట్టుకు తాము సిద్ధమని ఇంతియాజ్ జలీల్ ప్రకటించారు.

శుక్రవారం ఎన్సీపీ నేత, రాష్ట్ర మంత్రి రాజేశ్ తోపె తన ఇంటికి వచ్చారని, ఈ క్రమంలోనే ఆ వ్యాఖ్యలు చేశానని తెలిపారు. తన తల్లి చనిపోవడంతో పరామర్శ కోసమే తోపె వచ్చారని అన్నారు. ముస్లిం ఓట్లను చీల్చడం ద్వారా బీజేపీకి మజ్లిస్ పార్టీ బీ టీమ్ లా వ్యవహరిస్తోందంటూ ఆరోపిస్తున్నారని, అందులో నిజం లేదని చెప్పారు. అందులో భాగంగానే ఎన్సీపీ, కాంగ్రెస్ తో జట్టుకడతామంటూ తోపెకు చెప్పానని, మరి, ఇప్పుడు వాళ్లు సుముఖత చూపిస్తారా? లేదా మళ్లీ అలాంటి వ్యాఖ్యలే చేస్తారా? అనేది చూడాలని అన్నారు.

‘‘ఈ పార్టీలన్నింటికీ ముస్లింల ఓట్లు కావాలి. ఒక్క ఎన్సీపీనే కాదు.. కాంగ్రెస్ కు కూడా అవసరమే. అలాంటి వాళ్ల కోసం మేం చేతులు కలిపేందుకు సిద్ధమే. దేశానికి బీజేపీ భారీ నష్టాన్ని చేసింది. దాన్ని సరిదిద్దేందుకు బీజేపీని ఓడించడమే మా లక్ష్యం’’ అని చెప్పారు.

Related posts

మునుగోడులో ఓట్లు బీసీలవి …సీట్లు ఓసీలవి ఇదెక్కడి సామాజిక న్యాయం ….?

Drukpadam

కేంద్రంతో ,జగన్ కు చెడిన స్నేహం … వైసీపీ ,బీజేపీ లమధ్య మాటల యుద్ధం…

Drukpadam

ఎన్డీయేలో ఉన్న మూడు బలమైన పార్టీలు ఇవే: ఉద్ధవ్ థాకరే ఎద్దేవా

Ram Narayana

Leave a Comment