Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

వీరవనిత విప్లవనారీ మల్లు స్వరాజ్యం కు ప్రముఖుల నివాళులు..

వీరవనిత విప్లవనారీ మల్లు స్వరాజ్యం కు ప్రముఖుల నివాళులు..
-భౌతిక కాయం హైద‌రాబాద్‌లోని ఎంబీ భ‌వ‌న్‌లో..
-నల్లగొండ పార్టీ కార్యాలయంలో ప్రజల సందర్శనార్థం
-మ‌ల్లు స్వరాజ్యం సాహసం ఎందరికో స్ఫూర్తి: త‌మిళిసై
-ఆమె పేదల కోసం పోరాడారు: ఎర్రబెల్లి
-ఆమె పాడేమోసిన బివి రాఘవులు , తమ్మినేని

హైద‌రాబాద్ లోని బంజారాహిల్స్ కేర్ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం కన్నుమూసిన విష‌యం తెలిసిందే. ఆమె భౌతిక కాయం ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లోని ఎంబీ భ‌వ‌న్‌లో ఉదయం 9 గంటలవరకు , అనంతరం ఆమె సొంత జిల్లా నల్లగొండ కు తరలించి ప్రజల సందర్శనార్థం పార్టీ కార్యాలయంలో ఉంచారు . ఆమెకు ప‌లువురు ప్ర‌ముఖులు సంతాపం తెలిపారు. తెలంగాణ‌ సాయుధ పోరాటంలో మ‌ల్లు స్వరాజ్యం సాహసం ఎందరికో స్పూర్తి అని తెలంగాణ గవర్నర్ తమిళిసై అన్నారు. ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

కాగా, ఎంబీ భవన్లో మ‌ల్లు స్వ‌రాజ్యం భౌతిక కాయానికి మంత్రి ఎర్రబెల్లి, సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి నివాళులు అర్పించి మాట్లాడారు. ఆమె పేదల కోసం పోరాడార‌ని ఎర్రబెల్లి అన్నారు.

ఆమె మరణం దేశానికే తీరని లోటు అని చెప్పారు. మ‌ల్లు స్వ‌రాజ్యం పేరిట పుస్తకాలు, సినిమాలు రావాలని ఆకాంక్షించారు. పేదల కోసం మ‌ల్లు స్వ‌రాజ్యం వీరోచిత పోరాటాలు చేశారని కోదండరాం అన్నారు. రాజకీయాలు అంటే వ్యాపారం కాదని, ప్రజలకు శక్తినిచ్చే ఆయుధమని చాటి చెప్పారని అన్నారు. ఆమె పోరాటాలు ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తాయని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ చెప్పారు.

మల్లు స్వరాజ్యం భౌతికకాయాన్నిహైద్రాబాద్ నుంచి నల్ల‌గొండకు తరలించారు . అక్క‌డి పార్టీ కార్యాలయంలో సంతాప సభ నిర్వహించారు . అనంతరం ఆమె భౌతికకాయాన్ని ఆమె కోరిక మేరకు కుటుంబసభ్యులు మెడిక‌ల్ కాలేజీకి అప్పగించారు . కడసారి ఆమెను చేసేందుకు వేలాదిగా ప్రజలు నల్లగొండకు తరలివచ్చారు . జోహార్ మల్లు స్వరాజ్యం నినాదాలతో నల్లగొండ పట్టణం మారు మోగింది. ఆమె భౌతిక ఖాయం ఉంచిన పాడెను సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవలు , సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మోశారు . సిపిఎం ఏపీ కార్యదర్శి వి .శ్రీనివాసరావు కూడా అంత్యక్రియలకు హాజరైయ్యారు .

Related posts

రైలు ప్రమాద క్షతగాత్రులను పరామర్శించిన సీఎం జగన్

Ram Narayana

అల్లూరి ఓ నిప్పు కణం :సీఎం జగన్

Drukpadam

న్యాయం కోసం లంచం ఇవ్వలేను.. ఇందిరా పార్క్ వద్ద ఓ రైతు నిరసన!

Drukpadam

Leave a Comment