Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

షర్మిల …బీజేపీ ఎంపీ అరవింద్ మధ్య మాటల యుద్దం

షర్మిల …బీజేపీ ఎంపీ అరవింద్ మధ్య మాటల యుద్దం
-పసుపు బోర్డు ఏర్పాటు విషయంలో ఎంపీ మాట నిలబెట్టుకోలేదన్న షర్మిల
-బాండ్ పేపర్ రాసి మోసం చేశాడని ధ్వజం
-తాటాకు అని చెప్పి ఈతకు ఇచ్చారని హెద్దేవా
-పసుపు బోర్డు కు బదులు స్పైస్ బోర్డు ఇచ్చారని విమర్శ
-ఆంధ్రా బిడ్డ ,తెలంగాణ కోడలు నిజం తెలుసుకోకుండా మాట్లాడుతున్నారన్న అరవింద్
-రాజన్న రాజ్యం కాదు రాజారాజ్యం తెస్తాం
-మీ అన్న పరిపాలిస్తున్న రాష్ట్రంలో పసుపు ధర రూ 6850
-నిజామాబాద్ మార్కట్లో మంచి పసుపుకు రూ 10 ,500 పలుకుతుందన్న అరవింద్

పసుపు రైతుల విషయంలో జరుగుతున్నా అన్యాయం పై షర్మిల,బీజేపీ ఎంపీ అరవింద్ లమధ్య మాటల యుద్దం ఆశక్తిగా మారింది. నిజామాబాద్ లో వైయస్ అభిమానులతో మాట్లాడుతూ షర్మిల పసుపు రైతుల విషయం ప్రస్తావించారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో పోటీచేసి గెలిచినా ఎంపీ ఎన్నికైన ఐదు రోజుల్లో పసుపు బోర్డు తెస్తానని వాగ్దానం చేశారు.రైతులకు బాండ్ పేపర్ కూడా రాసి ఇచ్చారు. గెలిచి రెండు సంవత్సరాలు కావస్తున్నా ఇంటరవరకు బోర్డు లేదు. స్పైస్ బోర్డు ఇచ్చారు. అంటే తాటాకు అని చెప్పి ఈతాకు ఇచ్చారు. ఎంత మోసం దేశంలోనే నెంబర్ వన్ పసుపు పండిస్తున్న నిజామాబాద్ కు పసుపు బోర్డు రాకపోవటం దురదృష్టం అని అన్నారు. ఇది నమ్మించి మోసంచేయటం కదా ?అని ప్రశ్నించారు. దీనిపై బీజేపీకి చెందిన బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ షర్మిల పై ఫైర్ అయ్యారు. ఆంధ్ర బిడ్డ, తెలంగాణ కోడలు బ్రదర్ అనిల్ భార్య నాపేరు ప్రస్తావించారట . మంచిదే అయితే నిజాలు తెలుసుకోకుండా మాట్లాడారు. ఆమె అన్న పాలిస్తున్న రాష్ట్రంలో పసుపు క్వింటాల్ 6850 పలుకు తుంటే నిజామాబాద్ లో 10500 మంచి పసుపు ధర ఉంది.ఆంధ్ర నుంచి కూడా రైతులు నిజామాబాద్ మార్కెట్ కు వచ్చి ఇక్కడ పసుపు అమ్ముకొని పోతున్నారు.అది తెలుసుకోండి. రాజశేఖర్ రెడ్డి కు అభిమానులు ఉన్నారు. కాదనటంలేదు.అయితే వాస్తవాలు తెలుసుకుని మాట్లాడితే మంచిదని హితవుపలికారు. రాజన్న రాజ్యం కాదు ఇప్పుడు కావాల్సింది .రామరాజ్యం కావాలి .రాజన్న రాజ్యం అంటే ప్రభుత్వ ఖజానా నుంచి సబ్సిడీలు ఇవ్వటం. రామరాజ్యం అంటే రైతులకు మంచి ధర కల్పించటం అది తెలుసుకోండి అని అరవింద్ అన్నారు.

Related posts

కోమటిరెడ్డి వ్యవహారంపై అధిష్టానం సీరియస్ …బీజేపీ పాట పడటంపై గుస్సా …

Drukpadam

ఈ కిరికిరిగాళ్లు, ఈ కొండెగాళ్లకు ఏంటి కడుపుమంట?: సీఎం కేసీఆర్!

Drukpadam

కుప్పం చుట్టూ ఏపీ రాజకీయాలు…

Drukpadam

Leave a Comment