Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

జర్నలిస్టుల బైక్ లపై ఉన్న ప్రెస్ స్టిక్కర్లను తొలగించడం పై జాయింట్ సీపీ రంగనాథ్ స్పందన!

జర్నలిస్టుల బైక్ లపై ఉన్న ప్రెస్ స్టిక్కర్లను తొలగించడం పై జాయింట్ సీపీ రంగనాథ్ స్పందన!
-క్రైమ్ జర్నలిస్టులతో రంగనాథ్ సమావేశం
-ప్రెస్ స్టిక్కర్లపై 4 రోజుల సమయం ఇచ్చిన రంగనాథ్
-జర్నలిస్టులు గుర్తింపు కార్డులు తప్పనిసరిగా చూపించాలి
-యాజమాన్యాలు లేదా ప్రభుత్వం ఇచ్చిన అక్రిడేషన్ కార్డులు ఉంటె చాలు

హైదరాబాద్

గత వారం రోజులుగా హైదరాబాద్ సిటీ లో ట్రాఫిక్ పోలీస్ లకి జర్నలిస్టుల మధ్య నెలకొన్న వివాదం పై క్రైమ్ రిపోర్టర్స్ అంతా వెళ్లి జాయింట్ సీపీ ట్రాఫిక్ రంగనాథ్ ను కలిశారు.ప్రెస్స్ స్టికర్స్ తొలగింపు వివాదం పై సుదీర్ఘంగా జాయింట్ సీపీ ట్రాఫిక్ తో చర్చించిన క్రైం రిపోర్టర్స్.. చర్చల తర్వాత మీడియా సిబ్బంది, డెస్క్ జర్నలిస్టులు కావచ్చు ఎవరైనా కావచ్చు.. సంబంధిత మీడియా కంపెనీ జారీ చేసిన ఐడి కార్డులు, అక్రిడిటేషన్ కార్డులు చూపించాలి. అక్రిడిటేషన్ కార్డు లేని వారు సంబంధిత కంపెనీ ఐడి కార్డు చూపించాలి. ఇప్పటివరకైతే నాలుగు రోజుల పాటు ప్రెస్ స్టికర్స్ పై ఎటువంటి డ్రైవ్ చేయమని పోలీసులు తెలిపారు. ప్రెస్ ఐడి కార్డ్ లేకుండా ఉన్నవారు ఈ నాలుగు రోజుల్లో ప్రెస్ స్టిక్కర్లను సొంతంగా తీసి వేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఐడీ కార్డు లేదా అక్రిడేషన్ కార్డు ఉన్న వారిని ఆపమని జాయింట్ సీపీ రంగనాథ్ తెలిపారు. దీనిపై సిబ్బందికి ప్రత్యేక ఆదేశాలు జారీచేస్తామనికూడా పేర్కొన్నారు .

Related posts

మీడియాను ఎవ్వురు అడ్డుకోలేరు సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు.

Drukpadam

కంటెంట్ నచ్చకపోతే వెళ్లిపోవచ్చు… తన ఉద్యోగులకు నెట్ ఫ్లిక్స్ సూచన!

Drukpadam

పిస్టల్ తీసిన టీఆర్ యస్ నేత వారించిన సహచరులు

Drukpadam

Leave a Comment