టీఆర్ యస్ కు ఆలేరు మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్య గౌడ్ గుడ్ బై!
టీఆర్ఎస్‌పై కీలక వ్యాఖ్యలు.. పార్టీని వీడుతున్నట్లు ప్రకటన
బీజేపీలో చేరుతున్నట్లు భిక్షమయ్య గౌడ్ ప్రకటన
ప్రజల నుంచి తనను దూరం చేయాలని టీఆర్ఎస్ కుట్ర చేసిందని ఆరోపణ
మూడేళ్లుగా ప్రజలను కలవకుండా కట్టడి చేశారని ఆవేదన
టీఆర్ యస్ లో విమడలేని నాయకులు కొందరు తమదారి తాము చూసుకుంటున్నారు . అందులో భాగంగానే ఆలేరు కు చెందిన మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్య గౌడ్ టీఆర్ యస్ కు గుడ్ బై చెప్పి బీజేపీ చేరాలని నిర్ణయించుకున్నారు. తనను టీఆర్ యస్ లో అణగ దొక్కటానికి ప్రయత్నించారని పార్టీపై ఆరోపణలు గుప్పించారు. మూడు సంవత్సరాలుగా పార్టీ ఏమైనా అవకాశం ఇస్తుందని చేశానని కానీ అలాంటిది చేయలేదని అందువల్ల ఇక టీఆర్ యస్ ఉండటం వల్ల ఉపయోగం లేదని అనుకోని పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు .
తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్‌కు చెందిన కీలక నేత, ఆలేరు మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్య గౌడ్ ఆ పార్టీని వీడనున్నారు. అనంతరం ఆయన బీజేపీలో చేరబోతున్నారు. ఈ మేరకు స్వయంగా భిక్షమయ్య గౌడే సోమవారం ఓ లేఖ విడుదల చేశారు. ఆ లేఖలో తనకు టీఆర్ఎస్‌లో జరిగిన అవమానాలు, తత్ఫలితంగా తాను ఎదుర్కొన్న విపత్కర పరిస్థితుల గురించి ఆయన ఏకరువు పెట్టారు.
“ఆలేరు అభివృద్ధి, ప్రజల కష్టాలు తీర్చేందుకు 2018లో టీఆర్ఎస్‌లో చేరా. అభివృద్ధిలో నన్ను భాగస్వామిని చేస్తారని భావించా. ఇక్కడి ప్రజల నుంచి నన్ను వేరు చేసేందుకు కుట్ర చేశారు. ఇక్కడ తిరగొద్దని, ప్రజలను కలవొద్దని టీఆర్ఎస్ పెద్దలు ఆదేశించారు. మూడేళ్లుగా ప్రజలను కలవకుండా కట్టడి చేశారు. ప్రజల నుంచి దూరం చేయాలన్న కుట్రను నేనే ఛేదించాను. ప్రజలకు సేవ చేసేందుకే బీజేపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నా” అని ఆయన పేర్కొన్నారు.