Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఏం తమాషాలు చేస్తున్నారా?.. తెల్లవారుజామున పోలీసులపై ఎంఐఎం కార్పొరేటర్ రుబాబు..

ఏం తమాషాలు చేస్తున్నారా?.. తెల్లవారుజామున పోలీసులపై ఎంఐఎం కార్పొరేటర్ రుబాబు..
-తెలంగాణలో ఇలాంటివి నడవవ్.. ఎంఐఎం కార్పొరేటర్ పై మంత్రి కేటీఆర్ ఫైర్
-హోటళ్లను పోలీసులు మూసేయిస్తుండగా ఘటన
-రంజాన్ టైంలో తెల్లార్లూ తెరచే ఉంటాయన్న గౌసుద్దీన్
-రూ.100 తీసుకునే నువ్వూ నన్ను ఎదిరిస్తావా? అంటూ కానిస్టేబుల్ పై హేళన
-చర్యలు తీసుకోవాలంటూ డీజీపీని కోరిన కేటీఆర్
-ఎవరైనా సరే ఉపేక్షించవద్దని సూచన
-నిన్న అర్ధరాత్రి పోలీసులపై ఎంఐఎం కార్పొరేటర్ హల్ చల్
-ట్విట్టర్ లో కేటీఆర్ దృష్టికి తీసుకొచ్చిన నెటిజన్

పోలీసులపై అర్ధరాత్రి ఓ కార్పొరేటర్ రుబాబు చేశారు. నిన్న అర్ధరాత్రి 2 గంటలు దాటిన తర్వాత కూడా తెరచి ఉంచిన హోటళ్లను మూసేయిస్తున్న పోలీసులపై భోలక్ పూర్ ఎంఐఎం కార్పొరేటర్ గౌసుద్దీన్ హల్ చల్ చేశారు. బెదిరింపులకు పాల్పడ్డారు. హైదరాబాద్ లోని భోలక్ పూర్ డివిజన్ లో జరిగిందీ ఘటన. ఎంఐఎం కార్పొరేటర్ తీరుపై తెలంగాణ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు.దీంతో ఘటనపై స్పందించిన కేటీఆర్.. కార్పొరేటర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలంటూ డీజీపీ మహేందర్ రెడ్డిని మంత్రి కోరారు.

రంజాన్ మాసంలో హోటళ్లు తెల్లవార్లూ తెరచే ఉంటాయని తేల్చి చెప్పారు. పోలీసులు తమాషాలు చేస్తున్నారంటూ నోరు పారేసుకున్నారు. వచ్చినవాళ్లు డ్యూటీ చేసుకుని వెళ్లిపోవాలంటూ పోలీసులను హెచ్చరించారు. తమ డ్యూటీని తాము చేస్తున్నామని ఓ కానిస్టేబుల్ అనగా.. ‘‘రూ.100 తీసుకునేవాడివి నాకే ఎదురు చెబుతావా?’’ అంటూ అవమానకరంగా మాట్లాడారు.

కార్పొరేటర్ వచ్చాడని ఎస్సైకి చెప్పి పిలిపించాలని డిమాండ్ చేశారు. అయితే, ఈ వ్యవహారంపై ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి వివరాలు తెలుసుకున్నట్టు తెలుస్తోంది.

ఎంఐఎం కార్పొరేటర్ తీరుపై తెలంగాణ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. నిన్న అర్ధరాత్రి దాటాక భోలక్ పూర్ డివిజన్ లో డ్యూటీ చేస్తున్న పోలీసులపై ఎంఐఎం కార్పొరేటర్ గౌసుద్దీన్ రుబాబు చేసిన సంగతి తెలిసిందే.

దీనిపై ట్విట్టర్ లో నెటిజన్ ఒకరు వీడియోను ట్యాగ్ చేస్తూ విషయాన్ని కేటీఆర్ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఘటనపై స్పందించిన కేటీఆర్.. కార్పొరేటర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలంటూ డీజీపీ మహేందర్ రెడ్డిని మంత్రి కోరారు.

పోలీసుల విధులకు ఆటంకం కలిగించే ఎవరినైనా ఉపేక్షించవద్దని స్పష్టం చేశారు. తెలంగాణలో ఇలాంటి రచ్చను ఉపేక్షించవద్దన్నారు. ఇలాంటి ఘటనలకు పాల్పడే ఎంతటివారైనా, ఏ రాజకీయపార్టీకి చెందిన వారైనా వదలకూడదని సూచించారు.

Related posts

ఖమ్మంలో జర్నలిస్టులకు ఆయుర్వేద వైద్య శిబిరం విజయవంతం!

Drukpadam

అమెరికాలో టోర్నడో విలయతాండవం… 100 మంది బలి!

Drukpadam

కర్మకాండలకూ ఓ స్టార్టప్.. అన్నీ వారే చేస్తారట!

Drukpadam

Leave a Comment