Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
కోవిడ్ వార్తలు

డబ్బుల కోసం..జర్మనీలో 90 సార్లు కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వృద్ధుడు!

డబ్బుల కోసం సాహసం.. జర్మనీలో 90 సార్లు కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వృద్ధుడు!

  • టీకాతోపాటు ఇచ్చే వ్యాక్సినేషన్ పత్రమే అతడి వ్యాపారం
  • టీకాలు తీసుకోని వారికి ఫోర్జరీ చేసి విక్రయం
  • ఒకే కేంద్రానికి వరుసగా రెండో రోజు వచ్చి పట్టుబడిన వృద్ధుడు 
  • తూర్పు జర్మనీలోని శాక్సోనీ రాష్ట్రంలో ఘటన

‘కూటి కోసం కోటి విద్యలు’ అన్నట్టు జర్మనీలో 60 ఏళ్ల వృద్ధుడు డబ్బుల కోసం కొత్త దారి ఎంచుకున్నాడు. అది కూడా ప్రాణాలను రిస్క్ లో పెట్టడం అంటే మామూలు విషయం కాదు. ఒకటి రెండు సార్లు కాదు.. సుమారు 90 కరోనా వ్యాక్సిన్ డోసులను తీసుకున్నాడు. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న అనంతరం ధ్రువీకరణ పత్రం జారీ చేస్తారు కదా.. అలా ఇచ్చే వ్యాక్సినేషన్ కార్డును ఫోర్జరీ చేసి విక్రయించాలన్నది అతడి ఆలోచన.

కరోనా టీకా తీసుకోవడానికి విదేశాలలో చాలామంది ముందుకు రాని విషయం మనకు తెలిసిందే. భయం కావచ్చు, వేరే ఇతర ఆరోగ్య కారణాలు ఉండి ఉండొచ్చు. అలాంటి వారికి కరోనా వ్యాక్సిన్ తీసుకున్నట్టు సదరు వృద్ధుడు వ్యాక్సినేషన్ కార్డు ఇస్తాడు. తన పేరు స్థానంలో వారి పేరును టైప్ చేసి ఇవ్వడమే అతడు బిజినెస్ గా పెట్టుకున్నాడు. తూర్పు జర్మనీలోని మాగ్డేబర్గ్ ప్రాంతానికి చెందిన సదరు వృద్ధుడి పేరును అధికారులు బయటకు వెల్లడించలేదు.

శాక్సోనీ రాష్ట్రంలోని ఎలెన్ బర్గ్ కేంద్రానికి ఇటీవలే అతడు వరుసగా రెండో రోజు వచ్చి టీకా ఇవ్వాలని కోరాడు. దీంతో అక్కడి సిబ్బంది అతడ్ని గుర్తించి విషయం ఆరా తీశారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఒక కంపెనీ అని కాకుండా ఏది అందుబాటులో ఉంటే ఆ కంపెనీ వ్యాక్సిన్ అతడు తీసుకున్నట్టు తెలుసుకున్నారు. ఇలా 90 షాట్స్ తీసుకున్నట్టు గుర్తించారు. అతడి ఆరోగ్యంపై వాటి దుష్ప్రభావాల సమాచారం ఇంకా తెలియలేదు. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.

Related posts

కరోనా లాక్‌డౌన్ ఎత్తేయాలంటూ ఆస్ట్రేలియాలో రోడ్డెక్కిన ప్రజలు..

Drukpadam

రాహుల్ గాంధీ, బీజేపీ మధ్య కరోనా వ్యాక్సినేషన్ యుద్ధం!

Drukpadam

కరోనాతో ఆసుపత్రిపాలైన బెంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య

Drukpadam

Leave a Comment