Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

చంద్రబాబు , పవన్ కళ్యాణ్ ల హత్యకు కుట్ర…టీడీపీ నేత బోండా ఉమ సంచలన వ్యాఖ్యలు !

చంద్రబాబు , పవన్ కళ్యాణ్ ల హత్యకు కుట్ర…టీడీపీ నేత బోండా ఉమ సంచలన వ్యాఖ్యలు!
కేంద్ర నిఘా సంస్థలు ద్రుష్టి పెట్టాలని విజ్ఞప్తి
బాబాయ్ పై గొడ్డలి వేటును గుండెపోటుగా చిత్రీకరించారు
మంత్రివర్గంలో ఇప్పటివరకు దొంగల ముఠా ఉంది…ఇక గజదొంగల ముఠా వస్తుందని ధ్వజం
వైసీపీలో అంతా అంతర్జాతీయ దొంగల ముఠా
పీకే సర్వేలో జగన్ కు సింగల్ డిజిట్ వస్తుందని తేలడంతో జగన్ ఫ్రస్టేషన్

 

ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి క్యాబినెట్ భేటీకి ముందు పల్నాడు జిల్లా కేంద్రంగా చంద్రబాబు నాయుడు పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన విషయం తెలిసిందే. గతంలో ఎన్నడూ లేని విధంగా చారిత్రాత్మక పరిపాలన సాగుతుందని తాను మారీచులు, రాక్షసులతో యుద్ధం చేస్తున్నానని వ్యాఖ్యానించారు. అంతే కాదు హైదరాబాద్ లో ఉంటూ తనను విమర్శించే వారికి గుండెపోటు వస్తుంది అని జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమ పలు అనుమానాలు వ్యక్తం చేశారు.

జగన్ తన సొంత బాబాయ్ వివేకానంద రెడ్డి గొడ్డలి వేటుకు బలైతే, గుండెపోటు గా చిత్రీకరించారని, ఇప్పుడు హైదరాబాద్లో ఉంటూ విమర్శించే వారికి గుండెపోటు వస్తుందని చేసిన వ్యాఖ్యలు చంద్రబాబు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించేనని బోండా ఉమా వ్యాఖ్యానించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ల హత్యకు ఏదో కుట్ర జరుగుతుందన్న అనుమానం జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యల వల్ల కలుగుతుందని బోండా ఉమా వ్యాఖ్యానించారు.

గొడ్డలి వేటును గుండెపోటుగా చిత్రీకరించటంలో దిట్ట అయిన జగన్ మోహన్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారని పేర్కొన్న బోండా ఉమా కేంద్ర నిఘా సంస్థలు దీనిపై దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. ఇక ఇదే సమయంలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ పై మాట్లాడిన బోండా ఉమ ఇప్పటి వరకు ఉన్న మంత్రుల రూపంలో దొంగలముఠా రాష్ట్రాన్ని దోచుకున్నారని, ఇక మంత్రివర్గ మార్పుతో గజ దొంగల ముఠా ప్రజలను పీడించబోతుంది అంటూ వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించడం కోసమే మంత్రివర్గం మార్పు జరుగుతుందని బోండా ఉమ అభిప్రాయపడ్డారు.

రాబోయే ఎన్నికలలో సింగిల్ డిజిట్ తో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి వైసీపీకి ఉందని పీకే సర్వే రిపోర్ట్ స్పష్టం చేయడంతో జగన్ కు టెన్షన్ పట్టుకుందని బోండా ఉమా వ్యాఖ్యానించారు. అందుకే జగన్ క్యాబినెట్ మార్చేస్తూ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని బోండా ఉమా మండిపడ్డారు. రాష్ట్రంలో జగన్ పాలనపై పీకే సర్వే రిపోర్ట్ నేపథ్యంలో జగన్ కు చెమటలు పడుతున్నాయని బోండా ఉమా పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏపీలో అరాచకం రాజ్యమేలుతుందని బోండా ఉమ విమర్శించారు.

జంగారెడ్డి గూడెంలో కల్తీ సారా వల్ల మరణించిన మృతుల కుటుంబాలకు చంద్రబాబు, ఆత్మహత్యలకు పాల్పడిన కౌలు రైతుల కుటుంబాలకు జనసేన పవన్ కళ్యాణ్ తమ సొంత డబ్బులతో సహాయం అందించారని బోండా ఉమ పేర్కొన్నారు. సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని చెప్పుకునే జగన్ మంత్రులతో రాజీనామా చేయించటం కాదు అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు రావాలని బోండా ఉమా సవాల్ విసిరారు. అంతర్జాతీయ క్రిమినల్ గ్యాంగ్ అంతా వైసీపీలోనే ఉంది. ఈ దొంగల ముఠా రాష్ట్ర ప్రజల సంపదను దోచేస్తుంది అంటూ వైసీపీ ని టార్గెట్ చేశారు బోండా ఉమ.

Related posts

తుమ్మలకు మంత్రి పదవి అంటూ ప్రచారం …సంబరపడుతున్న అభిమానులు!

Drukpadam

కాంగ్రెస్ కు జై కొట్టిన మట్టా దయానంద్ …

Drukpadam

మరో సారి భారత్ పై ఓలి అక్కసు

Drukpadam

Leave a Comment