Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు కుమార్తె డాక్టర్ మహాలక్ష్మిఆత్మహత్య!

అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు కుమార్తె డాక్టర్ మహాలక్ష్మి
-ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న టీఆర్ఎస్ నేత కుమార్తె మహాలక్ష్మి
-ఎంబీబీఎస్ పూర్తిచేసి ప్రస్తుతం పీజీకి సన్నద్ధమవుతున్న మహాలక్ష్మి
-గుండెలవిసేలా రోదించిన తాటి

పినపాక నియోజకవర్గంలోని సారపాకలో నివాసం ఉంటున్న టీఆర్ఎస్ నేత, అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు కుమార్తె డాక్టర్ తాటి మహాలక్ష్మి నిన్న ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడటం కలకలం లేపింది. పొద్దెక్కినా మహాలక్ష్మి తన గది తలుపులను తెరవకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు తలుపులు పగలగొట్టి గదిలోకి వెళ్లారు.అయితే, లోపల కనిపించిన దృశ్యం చూసి నిర్ఘాంతపోయారు. మహాలక్ష్మి గదిలో ఉరికి వేలాడుతూ కనిపించడంతో షాకయ్యారు. వెంటనే ఆమెను కిందికి దించి భద్రాచలంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆమె మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించగా, పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

విషయం తెలిసిన తాటి వెంకటేశ్వర్లు వెంటనే భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. కుమార్తె మృతదేహాన్ని చూసి గుండెలవిసేలా రోదించారు. ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఎంబీబీఎస్ పూర్తి చేసిన మహాలక్ష్మి ప్రస్తుతం పీజీ కోసం సన్నద్ధమవుతున్నారు. ఏంటో అల్లారు ముద్దుగా పెంచుకుని ఎంబిబిఎస్ చదివించడమే కాకుండా ,పిజి సీటుకోసం కూడా ప్రిపేర్ అవుతున్న వేళ ఆత్మహత్యకు పాల్పడటంపై కుటుంబ సభ్యులు తట్టుకోలేక పోతున్నారు. ఎందుకు ఇలా జరిగింది అనేది ప్రతివారిలో మెదులుతున్న ప్రశ్న ? డాక్టర్ మహా లక్ష్మి తల్లి కూడా రెండు సంవత్సరాల క్రితం ఆనారోగ్యంతో చనిపోయింది. మహాలక్ష్మి మృతిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు . డాక్టర్ మహాలక్ష్మి మృతిపట్ల జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ , ఎంపీ నామా నాగేశ్వరరావు , అశ్వారావు పేట ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావు , మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు , సంతాపం తెలిపారు . ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విషయం తెలిసిన వెంటనే సారపాక చేరుకొని మ్రాతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు . తాటికి పరామర్శించి దైర్యం చెప్పారు .

Related posts

భార్య‌ను స‌జీవంగా పూడ్చి పెట్టిన కసాయి భ‌ర్త‌!

Drukpadam

లఖింపూర్ ఖేరీ నిరసనల్లో 8 మంది మృతి…

Drukpadam

యూపీలో గన్ కల్చర్ …పోలీసుల సమక్షంలోనే ఇద్దరు కాల్చివేత…!

Drukpadam

Leave a Comment