Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

గెలిచే వారికే టికెట్లు.. గెల‌వ‌లేని వారు ప‌క్క‌కే: జ‌గ‌న్ కీల‌క వ్యాఖ్య‌లు

  • జూలై 8న పార్టీ ప్లీన‌రీ
  • మే 10 నుంచి గ‌డ‌ప గ‌డ‌ప‌కు వైసీపీ
  • ఏ ఒక్క‌రూ ప్ర‌త్యేకం అని భావించ‌రాదన్న జగన్
  • ఎన్నికల్లో గెలిచేందుకు వ‌న‌రులు స‌మ‌కూరుస్తామని వెల్లడి

పార్టీ కీల‌క నేత‌ల‌తో స‌మావేశం సంద‌ర్భంగా వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప‌లు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఎన్నికల్లో గెలిచే వారికే టికెట్లు ఇస్తామ‌న్న ఆయ‌న… గెల‌వ‌లేని వారిని ప‌క్క‌న‌పెట్టేస్తామ‌ని కరాఖండీగా చెప్పేశారు. జులై 8న పార్టీ ప్లీన‌రీ నిర్వ‌హించ‌నున్న‌ట్లు ప్ర‌కటించిన జ‌గ‌న్‌… మే 10న గ‌డ‌ప గ‌డ‌ప‌కు వైసీపీ కార్య‌క్ర‌మాన్ని ప్రార‌భించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. పాత మంత్రులు, జిల్లా అధ్య‌క్షుల‌కు కీల‌క భాధ్య‌త‌లు అప్ప‌గిస్తాన‌ని జ‌గ‌న్ చెప్పారు. రెండేళ్ల‌లో ఎన్నిక‌ల‌కు వెళుతున్నామ‌న్న జ‌గ‌న్‌… ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను ప్రజ‌ల్లోకి తీసుకెళ్లాల‌ని ఆదేశాలు జారీ చేశారు. 

ఈ సంద‌ర్భంగా మంత్రులు, ఎమ్మెల్యేల‌కు జ‌గ‌న్ హెచ్చరిక‌లు జారీ చేశారు. ఎన్నిక‌ల్లో గెలిచే ప‌రిస్థితి లేనివారిని ప‌క్కన‌పెట్ట‌నున్న‌ట్లు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఎవ‌రికైనా పార్టీనే సుప్రీం అని చెప్పిన జ‌గ‌న్‌… గెలిచిన వారికే మంత్రి ప‌ద‌వులు దక్కుతాయ‌ని చెప్పారు. గెలిచేందుకు కావాల్సిన వ‌న‌రుల‌ను స‌మ‌కూరుస్తాన‌ని కూడా జ‌గ‌న్ చెప్పుకొచ్చారు. ఏ ఒక్క‌రు కూడా తాము ప్ర‌త్యేకం అనుకోవ‌డానికి వీల్లేద‌ని కూడా జ‌గ‌న్ హెచ్చ‌రించారు.

175కి 175 సీట్లు ఎందుకు రాకూడ‌దు?.. నేత‌ల‌తో స‌మీక్ష‌లో జ‌గన్

వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌న పార్టీ ముఖ్య నేత‌లు, మంత్రులు, పార్టీ రీజ‌న‌ల్ కో ఆర్డినేట‌ర్లు, జిల్లా అధ్య‌క్షుల‌తో నిర్వ‌హించిన స‌మావేశంలో ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో మొత్తం 175 సీట్లుంటే… వాట‌న్నింటిలోనూ వైసీపీ ఎందుకు గెల‌వకూడ‌ద‌ని జ‌గ‌న్ ఆస‌క్తిక‌ర కామెంట్ చేశారు. అస‌లు 175కీ 175 సీట్లు మ‌న‌కు ఎందుకు రాకూడ‌దు? అంటూ జ‌గ‌న్ ప్రశ్నించారు.  

2024 ఎన్నిక‌ల్లో పార్టీ విజ‌య‌మే ల‌క్ష్యంగా వ్యూహాలు ర‌చించేందుకు జ‌రిగిన ఈ స‌మావేశంలో జ‌గ‌న్ పార్టీ నేత‌ల‌తో ప‌లు కీల‌క అంశాల‌ను ప్ర‌స్తావించారు. ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్ మాట్లాడుతూ… ‘మంత్రులు అంద‌రినీ క‌లుపుకుని వెళ్లాలి. ప్ర‌తి ఎమ్మెల్యే నెల‌కు 10 స‌చివాల‌యాలు తిర‌గాలి. గ‌త ఎన్నిక‌ల్లో 151 సీట్లు గెలిచాం. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఈ సీట్ల సంఖ్య త‌గ్గ‌కూడ‌దు. అస‌లు 175కి 175 సీట్లు ఎందుకు రాకూడు?’ అని జ‌గ‌న్ వ్యాఖ్యానించారు.

Related posts

జర్నలిస్ట్ ల సమస్యలను ప్రధాన మంత్రికి దృష్టికి తీసుకు వెళ్తా … కేంద్రమంత్రి కిషన్ రెడ్డి !

Drukpadam

జీపీఎస్ పరికరంతో భర్త రాసలీలల గుట్టురట్టు చేసిన భార్య

Drukpadam

టీఆర్ యస్ కార్యాలయాలకు భూముల కేటాయింపు చట్టవిరుద్ధం …హైకోర్టులో కేసు

Drukpadam

Leave a Comment