విశాఖ లో మత్తు ఇంజెక్షన్ లా గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు!
-మత్తు లో తూలాడుతున్న విశాఖ యూత్
-బెంగాల్ నుండి నేరుగా విశాఖ కి మత్తు ఇంజెక్షన్ సరుకు
-ఒక్కొక్క ఇంజెక్షన్ 2000నుండి 6000రూపాయలకి విక్రయాలు
విశాఖపట్నంలో మత్తు ఇంజెక్షన్ల దందా జోరుగా జరుగుతోంది. వారంలో రెండోసారి మత్తు ఇంజెక్షన్లను పట్టుకున్నారు పోలీసులు. విశాఖ లీలా మహాల్ , భీమిలి ప్రాంతాల్లో పెంటాజోసైన్ ఇంజెక్షన్లను (pentazocine injection) విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వీరిద్దరూ వెస్ట్ బెంగాల్‌కు చెందిన వారిగా గుర్తించారు. ఖరగ్‌పూర్ నుంచి 1300 రూపాయలకు బాక్స్ కొనుగోలు చేసి విశాఖలో రూ.6000కు అమ్ముతున్నట్లు పోలీసులు తేల్చారు. మత్తు కోసం యువత విచ్చలవిడిగా ఈ ఇంజెక్షన్‌ను వినియోగిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. సర్జరీ అయిన రోగులకు మత్తు ఇచ్చేందుకు ఈ పెంటాజోసైన్ ఇంజెక్షన్లను వినియోగిస్తుంటారు వైద్యులు. పక్కా సమాచారంతో దాడులు చేసిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు నాలుగు బాక్స్‌ల ఇంజెక్షన్లను స్వాధీనం చేసుకున్నారు.
అంతకుముందు హైదరాబాద్ నగరంలోని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోనూ ఆదివారం భారీగా గంజాయి పట్టుబడింది. పత్తి విత్తనాల మాటున గంజాయి సరఫరా చేస్తున్న ముఠా గుట్టును ఎస్వోటి అధికారులు రట్టు చేశారు. వారి వద్ద నుంచి 800 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకన్నారు. ఇందుకు సంబంధించి ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇద్దరిని అరెస్ట్ చేశారు. వీరు ఒడిశా నుంచి హైదరాబాద్ మీదుగా గంజాయి రవాణా చేస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ గంజాయిని యూపీతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలకు సరఫరా చేసేందుకు తీసుకెళ్తున్నట్టుగా కనుగొన్నారు. ఈ ఘటనకు సంబంధించి పరారీలో ఉన్న ముగ్గురు యూపీ వాసుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.
మరోవైపు హైద్రాబాద్‌లో అంతర్జాతీయ డ్రగ్స్ పెడ్లర్ ఆశీష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. వ్యాపారం పేరుతో ఆశిష్ జైన్ డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. Ashish Jain ఇంట్లో NCB అధికారులు సోదాలు నిర్వహించారు.ఈ సోదాల్లో రూ. 3.71 కోట్లు స్వాధీనం చేసుకొన్నారు. అమెరికాతో పాటు పలు విదేశాలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని ఎన్సీబీ గుర్తించారు. Pharrmacy ముసుగులో ఆశీష్ డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నారని ఎన్సీబీ గుర్తించింది., బిట్ కాయిన్, క్రిఫ్టో కరెన్సీ ద్వారా లావా దేవీలు జరిగాయని కూడా అధికారులు గుర్తించారు.
ఇంటర్ నెట్ పార్మసీ, జీఆర్ ఇన్‌పీనిటీ పేరుతో ఆశీష్ జైన్ వ్యాపారం చేస్తున్నారని ఎన్సీబీ గుర్తించింది. గత రెండేళ్లలో వెయ్యికి పైగా విదేశఆలకు ఆర్డర్లు పంపిన విషయాన్ని కూడా ఎన్సీబీ గుర్తించింది.న్యూఢిల్లీకి చెందిన ఎన్సీబీ అధికారుల బృందం హైదరాబాద్ హిమాయత్ నగర్‌లోని ఆశీష్ ఇంట్లో సోదాలు నిర్వహించారు.ఈ సోదాల్లో డ్రగ్స్ కూడా సీజ్ చేశారు.