ఆంధ్రప్రదేశ్

నెగ్గిన షిండే: అనుకూలంగా 164 ఓట్లు

నెగ్గిన షిండే …

  • అనుకూలంగా 164 మంది ఎమ్మెల్యేల ఓటు
    మహారాష్ట్ర అసెంబ్లీలో ఏక్ నాథ్ షిండే తన బలాన్ని నిరూపించుకున్నారు. ఈ ఉదయం శాసన సభలో జరిగిన విశ్వాస పరీక్షలో షిండేకు అనుకూలంగా 164 మంది ఎమ్మెల్యేలు ఓటు చేశారు. ఇందులో 40 మంది శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఉన్నారు. విశ్వాస పరీక్షలో నెగ్గిన షిండే మహారాష్ట్ర 20వ ముఖ్యమంత్రిగా తన అధికారాన్ని కాపాడుకున్నారు. ఇక విశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా 99 ఓట్లు మాత్రమే వచ్చాయి.

నిన్నటిదాకా అఘాడి కూటమితో ఉన్న శివసేనకు చెందిన ఎమ్మెల్యే సంతోష్ బాంగర్ చివరి నిమిషంలో థాకరేకు షాకిచ్చారు. బల పరీక్షలో విశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటేశారు. షిండేకు మద్దతుగా బీజేపీతోపాటు బహుజన్ వికాస్ అఘాడి కూడా ఓటు వేసింది. ఇక విశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా మహా వికాస్ అఘాడి కూటమిలోని శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ ఎమ్మెల్యేలతో పాటు సమాజ్ వాద్ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు, ఎంఐఎంకి చెందిన ఓ ఎమ్మెల్యే ఓటు వేశారు.

Related posts

మహా ఉగ్ర గోదారి ….భద్రాచలం వద్ద 71 అడుగులు…ఇక శాంతించే అవకాశం!

Drukpadam

ఖమ్మంలో బీఆర్ యస్ షాక్ …20 డివిజన్ కార్పొరేటర్ బిక్కసాని ప్రశాంత లక్ష్మి గుడ్ బై!

Ram Narayana

2020 ప్రపంచాన్ని వణికించిన కరోనా

Drukpadam