Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

తెలంగాణ‌లో విద్యా సంస్థ‌ల‌కు మ‌రో 3 రోజుల పాటు సెల‌వులు!

తెలంగాణ‌లో విద్యా సంస్థ‌ల‌కు మ‌రో 3 రోజుల పాటు సెల‌వులు!

  • ప్రక‌ట‌న విడుద‌ల చేసిన ప్ర‌భుత్వం
  • ఈ నెల 18న తెర‌చుకోనున్న పాఠ‌శాల‌లు
  • వ‌ర్షాల వ‌ల్ల ఏకంగా 8 రోజుల పాటు మూత‌ప‌డిన విద్యా సంస్థ‌లు

తెలంగాణ‌లో విద్యా సంస్థ‌ల‌కు మ‌రో 3 రోజుల పాటు సెల‌వులు ప్ర‌క‌టిస్తూ కేసీఆర్ స‌ర్కారు బుధ‌వారం మ‌ధ్యాహ్నం నిర్ణ‌యం తీసుకుంది. ఎడ‌తెరిపి లేకుండా కురుస్తున్న వ‌ర్షాల కార‌ణంగానే ఈ దిశ‌గా నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ప్ర‌భుత్వం వెల్ల‌డించింది. వ‌ర్షాల కార‌ణంగా ఇప్ప‌టికే తెలంగాణ‌లో విద్యా సంస్థ‌ల‌కు 3 రోజుల పాటు సెల‌వులు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. తాజాగా ఈ సెల‌వుల‌ను మ‌రో 3 రోజుల పాటు పొడిగిస్తూ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది.

తాజా ప్ర‌క‌ట‌న‌తో ఈ నెల 18న తిరిగి పాఠ‌శాల‌లు పునఃప్రారంభం కానున్నాయి. వాస్త‌వానికి తాజా ప్ర‌క‌ట‌న‌తో ఈ నెల 16 వ‌ర‌కే విద్యాల‌యాల‌కు సెల‌వులు ఉండ‌గా… 17న ఆదివారం కావ‌డంతో పాఠ‌శాల‌లు ఈ నెల 18న సోమ‌వారం పునఃప్రారంభం కానున్నాయి. మొత్తంగా వ‌ర్షాల కార‌ణంగా ఈ వారం మొత్తం పాఠ‌శాలలు తెర‌చుకోలేదు.

గ‌త శ‌నివారం ప‌ని చేసిన పాఠశాల‌లు ఆదివారం సెల‌వుతో తిరిగి సోమ‌వారం ప్రారంభం కావాల్సి ఉండగా… వ‌ర్షాల కార‌ణంగా 3 రోజుల పాటు ప్ర‌భుత్వం సెల‌వులు ప్ర‌క‌టించింది. సెల‌వులు ముగియ‌నున్న బుధ‌వారం మ‌రో 3 రోజుల పాటు సెల‌వుల‌ను పొడిగించారు. వెర‌సి తెలంగాణ‌లో వ‌రుస‌గా 8 రోజుల పాటు విద్యాల‌యాలు మూతప‌డిన‌ట్టయింది.

Related posts

పట్టభద్రుల ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న గట్టి పోటీ…

Drukpadam

ప్రభుత్వం పై సన్నగిల్లిన ఆశలు- పిండిప్రోలులో స్వచ్ఛంద లాక్ డౌన్

Drukpadam

టెన్నిస్ స్టార్ సానియా మీర్జా రిటైర్మెంట్ ప్రకటన..!

Drukpadam

Leave a Comment