Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

గోదావరి వద్ద పెరుగుతున్న వరద ఉదృతిని పరిశీలించిన మంత్రి పువ్వాడ..

గోదావరి వద్ద పెరుగుతున్న వరద ఉదృతిని పరిశీలించిన మంత్రి పువ్వాడ..
▪️అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశం..
▪️పునరావాస కేంద్రాల్లో బాధితులతో మాట్లాడి ధైర్యం కల్పించిన మంత్రి.
▪️తక్షణ సహాయక చర్యల నిమిత్తం సిద్దంగా ఉంచిన హెలికాప్టర్..
▪️భద్రాచలంలోని ఉంటానని విలేకరుల సమావేశంలో వివరించిన మంత్రి .

ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు గొదావరి ఉదృతి పెరుగుతున్న తరుణంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తం గా ఉండాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆదేశించారు. భద్రాచలంలో గొదావరి బ్రిడ్జి పై నుండి వరద ఉద్రుతినీ పరిశీలించారు. అనంతరం భద్రాచలం పట్టణంలోని సుభాష్ నగర్ లో గల వరద ముంపు బాధితుల పునరావాస
కేంద్రాలను పరిశీలించి వారికి ధైర్యం కల్పించారు.

 

 

అనంతరం భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయం నందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి పువ్వాడ మాట్లడుతూ..ప్రజలకు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా అధికార యంత్రాంగం అనునిత్యం అప్రమత్తంగా ఉండాలన్నారు.వరద ఉదృతి తీవ్రస్థాయిలో ఉంటే తక్షణ సహాయ చర్యల నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం హెలికాప్టర్ ను ఏర్పాటు చేసిందని, ITDA, ITC లో హెలిప్యాడ్ సిద్దం చేశామన్నారు. ముఖ్యమంత్రి కేసీఅర్ గారి సూచనల మేరకు సహాయక చర్యల కోసం పోలీస్ యంత్రాంగంతో పాటు CRPF, NDRF సిబ్బంది అదనపు బలగాలతో సిద్దంగా చేశామన్నారు.

ఇతర ప్రాంతాల ప్రజలు బయటకు రాకుండా ఎక్కడి వారు అక్కడే ఉండాలని, అనవసరంగా బయటకు రాకుండా ఉండాలన్నారు.సాహసకృత్యాలు చేయడం, చేపల వేటకు వెళ్ళడం, అకారణంగా రోడ్లపైకి రావడం సరికాదని సూచించారు. ఎక్కడి వారు అక్కడే ఉండాలని కోరారు.
గోదావరికి ఎగువ నుండి వస్తున్న భారీ వరదలు, వర్షాలకు పొంగి పొర్లుతున్న వాగులు వంకలతో
ప్రాజెక్టులన్ని జలమయమైనాయని, దీనితో దిగువ ప్రాంతానికి వస్తున్న వరదల వల్ల భద్రాచలం వద్ద గోదావరి ఉదృతంగా ప్రవహిస్తున్నదని అన్నారు.

భద్రాచలం వద్ద గోదావరి 66 అడుగులకు వచ్చే అవకాశం ఉందని జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి వారికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ గారిని అదేశించారు.లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులను ఆదేశించామని అన్నారు.

వరదలు పూర్తి స్ధాయిలో అదుపులోకి వచ్చే వరకు భద్రాచలంలో మకాం వేసి ఎప్పటికపుడు వరద పరిస్థితిని అంచనా వేస్తూ, అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తున్నామన్నారు. ముంపు మండలాల్లో ఆయా ఏర్పాట్ల పర్యవేక్షణకు జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ అధికారులు, సిబ్బంది, పోలీస్ ఇతర ప్రత్యేక అధికారులను నియమించామన్నారు.

గత అనుభవాల దృశ్య వరదలపై మాకు అంచనా ఉందని, ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనే వ్యూహంతో ఉన్నామని, అధికారులు అన్ని గ్రామాల్లో సిద్దంగా ఉన్నప్పటికీ ప్రజలు సంయమనం పాటించి ఎక్కడి వారు అక్కడే ఉండాలన్నారు.ప్రజల అవసరాల కోసం 24 గంటలు పని చేయువిదంగా కలెక్టరేట్, ఐటిడిఎ, సబ్ కలెక్టర్, ఆర్డిఓ కార్యాలయాలలో కంట్రోల్ రూములు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

ప్రజలు అధికారులకు సహకరిస్తూ పునరావాస కేంద్రాలకు వెళ్లాలని మంత్రి పువ్వాడ సూచించారు. జిల్లా యంత్రాంగం, ప్రజలు, వరదలు వర్షాల వల్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని కోరారు. ప్రసవ రోజులు దగ్గరగా ఉన్న గర్భిణి మహిళలను ఆసుపత్రులకు తరలించి వైద్యులపర్యవేక్షణలో ఉంచాలని వైద్యాధికారులను ఆదేశించారు.

ప్రభుత్వ విప్ రేగ కాంతారావు, జిల్లా కలెక్టర్ అనుదీప్ ఎస్పీ వినీత్ ,ITDA PO గౌతమ్ గారు, CE ఇరిగేషన్ శ్రీనివాస్ రెడ్డి, SE వెంకటేశ్వర రెడ్డి, మాజి ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మి నారాయణ ఇతర అధికారులు పాల్గొన్నారు .

 

మంత్రి పువ్వాడ అజయ్ భద్రాచలంలో గోదావరి బ్రిడ్జి పై నుంచి వరద ఉదృతిని పరిశీలించారు . పట్టణంలోని పునరావాస కేంద్రాలకు వెళ్లి భాదితులకు ధైర్యం చెప్పారు .

Related posts

ఎన్ని కిలోమీటర్లు ప్రయాణిస్తే.. అంతే టోల్ చార్జీ.. త్వరలో కొత్త విధానం!

Drukpadam

ఏపీలో నిలిచిపోయిన ఆరోగ్యశ్రీ.. కడపలో 17 ఆసుపత్రులపై చర్యలు

Ram Narayana

అమెరికాలో ఎంట్రీ ఇచ్చిన మేడిన్ ఇండియా బండి…!

Drukpadam

Leave a Comment