Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

ప్రధాని మోదీ హత్యకు కుట్ర.. ఛేదించిన బీహార్ పోలీసులు!

ప్రధాని మోదీ హత్యకు కుట్ర.. ఛేదించిన బీహార్ పోలీసులు!
-ఇంటెలిజెన్స్ బ్యూరో సమాచారం మేరకు రంగంలోకి దిగిన పోలీసులు
ఇద్దరు ఉగ్రవాదుల అరెస్ట్
-2047 నాటికి భారత్ ను ఇస్లామిక్ రాజ్యంగా మార్చాలనే లక్ష్యం వెలుగులోకి

భారత ప్రధాని నరేంద్ర మోడీ హత్యకు ఇస్లామిక్ తీవ్రవాదం పథకం రచించిన వ్యవహారం వెలుగు చూసింది. ప్రధాని మోడీ ప్రధాన లక్ష్యంగా హత్యకు కుట్ర పన్నినట్టు వెల్లడైంది. ఈ విషయాన్ని బీహార్ పోలీసులు నిర్ధారించారు. తమకు వచ్చిన సమాచారం ఆధారంగా నేషనల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ కు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన ఎన్ఐఏ ఉగ్రవాదులను కస్టడీలోకి తీసుకొని విచారించింది. ఈ విచారణలో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రధాని హత్య కుట్ర తో పాటు భారతదేశాన్ని 2047 నాటికీ ఇస్లామిక్ రాజ్యం గా మార్చాలనే లక్ష్యంతో వారు పని చేస్తున్నట్లు వెల్లడించారు .దీనిపై లోతు అయిన విచారణ జరపాలని ఎన్ ఐ ఏ నిర్ణయించింది.

ప్రధాని నరేంద్ర మోదీపై దాడికి ఉగ్రవాదులు పన్నిన కుట్రను బీహార్ పోలీసులు ఛేదించారు. ఈ సందర్భంగా పాట్నాలో ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. 2047 నాటికి భారత్ ను ఇస్లామిక్ రాజ్యంగా చేయాలన్నది ఉగ్రవాదుల లక్ష్యమని.. అలాగే, ప్రధాని మోదీ రెండో లక్ష్యంగా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. జులై 12న ప్రధాని పర్యటన సందర్భంగా ఆయనను లక్ష్యం చేసుకోవాలని ఉగ్రవాదులు కుట్ర పన్నినట్టు బీహార్ పోలీసులు ప్రకటించారు.

అస్థార్ పర్వేజ్, జలూలుద్దీన్ అనే ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాని పర్యటనకు 15 రోజుల ముందు పాట్నాలోని పుల్వారీ షరీఫ్ ప్రాంతంలో వీరు శిక్షణ పొందినట్టు తెలుసుకున్నారు. ఆ ప్రాంతం నుంచి పోలీసులు కొన్ని డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి ద్వారానే ఇస్లామిక్ రాజ్య స్థాపన లక్ష్యం బయటపడింది. పుల్వారీ షరీఫ్ ప్రాంతంలో ఉగ్రవాదుల కదలికల సమాచారం ఇంటెలిజెన్స్ బ్యూరోకి తెలియడంతో, బీహార్ పోలీసులకు, ఎన్ఐఏకు సమాచారం ఇచ్చింది. దీని ప్రకారం ఉగ్రవాదులను పట్టుకొన్నారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి యువత పుల్వామా షరీఫ్ ప్రాంతానికి వచ్చి ఉగ్రవాదంలో శిక్షణ తీసుకుంటున్నట్టు గుర్తించారు.

Related posts

చుట్టూ మనుషులున్నా రూ.10 లక్షల నెక్లెస్ కొట్టేసింది.. గోరఖ్ పూర్ లో ఓ మహిళ చేతివాటం..

Drukpadam

విశాఖ ఎంపీ కుటుంబసభ్యుల కిడ్నప్ కలకలం ….ఛేదించిన పోలీసులు

Drukpadam

వరంగల్ కేఎంసీలో ర్యాగింగ్ కలకలం.. మోదీ, షా, కేటీఆర్, డీజీపీకి విద్యార్థి ఫిర్యాదు!

Drukpadam

Leave a Comment